Logo
Date of Publish : 04 July 2024, 9:30 pm
Editor : CH. MUKUNDARAO

దివ్యాంగులకు వీల్‌ ఛైర్స్‌, ఆర్ధిక సాయం

 పిఠాపురం,  జూలై 04 : వంగవీటి మోహన్‌ రంగా 77వ జన్మదినోత్సవం సంధర్భంగా గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన వీరమహిళ మేడిశెట్టి నాగమణి అధ్యక్షతన జనసేన నాయుకుడు జ్యోతుల సురేష్‌  దివ్యాంగుల మధ్యన జన్మదిన వేడులు నిర్వహించారు. ఈ సధర్భంగా దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే కాశీ బేగం అనే మహిళకు పెన్షన్‌ లేక ఇబ్బందిపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించి జూలై నెల పెన్షన్‌ కింద రూ.5వేలు అందించారు. అదే విధంగా ఓరుగంటి శివ అనే దివ్యాంగుడుకి 2 వీల్‌ ఛైర్‌, రైస్‌ అందజేశారు. ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి జనసేన వీర మహిళ కోలా దుర్గ, ఉరుకుటి దొరబాబు మేడిశెట్టి నాగమణి, జ్యోతుల సురేష్‌లను ప్రశంసించి, వంగవీటి మోహన్‌ రంగా చేసిన పోరాటల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save