
*చెన్నైలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చెన్నై: భారత స్వాతంత్ర సమరంలో మహనీయుల త్యాగాలను మరువకూడదని, యువత చరిత్రను తెలుసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. చెన్నై మహా నగరంలోని కొడుంగయూర్ సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు.సంఘం ప్రెసిడెంట్ బి. సురేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల గొప్పతనాన్ని గుర్తు చేశారు.
అనంతరం సంఘ పెద్దలు ఎర్రభనేని పట్టాభిరామయ్య, వంజరపు శివయ్య, బి. సుబ్బారావు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. వారు యువతకు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్ఫూర్తిగా నిలిపే విధంగా చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సంక్షేమ సంఘం సెక్రటరీ పి. లక్ష్మణరావు, ట్రెజరర్ డి. పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎన్. చంద్రశేఖర రెడ్డి, ఏ. దుర్గాప్రసాద్, సహాయ కార్యదర్శులు కే. శ్రీనివాస కుమార్, బి. శ్రీధర్ తదితరులు పర్యవేక్షించారు.తెలుగు ప్రజలతో పాటు కమిటీ సభ్యులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా యువత దేశ చరిత్రను తెలుసుకోవడంతో పాటు, మహనీయుల త్యాగాలను తమ జీవితాలకు స్ఫూర్తిగా మార్చుకోవాలని వక్తలు సందేశం ఇచ్చారు.