Logo
Date of Publish : 16 October 2024, 8:46 pm
Editor : CH. MUKUNDARAO

వీర పాండ్య కట్ట బ్రహ్మన్ భౌతికంగా మరణించినా కోట్లాది దేశభక్తుల హృదయాల్లో జీవించే ఉంటారు: డాక్టర్ ఇళయ కట్ట బొమ్మన్

చెన్నై న్యూస్: మహావీరుడు వీర పాండ్య కట్ట బొమ్మన్ భౌతికంగా మరణించినా కోట్లాది దేశభక్తుల హృదయాలలో నిత్యం జీవించే ఉంటారని వీర పాండ్య కట్ట బొమ్మన్ పీపుల్స్ డెవలప్మెంట్ మూమెంట్ వ్యవస్థాపకులు ఎల్ టి ఆర్ డాక్టర్ ఇళయకట్ట బొమ్మన్ అన్నారు. వీర పాండ్య కట్ట బొమ్మన్ 225 వ వర్ధంతి సందర్భంగా చెన్నై గిండి లోనీ మహాత్మా గాంధీ మని మండపం ఆవరణంలో ఉన్న వీర పాండ్య కట్ట బొమ్మన్ శిలా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వీర పాండ్య కట్ట బొమ్మన్ శిలా విగ్రహం పూలమాలలతో అలంకరించారు.

బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మంత్రులు కె ఎస్ ఆర్ రామచంద్రన్ ,మా సుబ్రహ్మణ్యం, పీకే శేఖర్ బాబు, పార్లమెంట్ సభ్యురాలు తమిళచ్చి తంగపాండియన్, చెన్నై మేయర్ ప్రియ ఉన్నతాధికారులు పూలమాలవేసి నివాళి అర్పించారు.

అనంతరం పలువురు తెలుగు ప్రముఖులు, వీర పాండ్య కట్ట బొమ్మన్ సంక్షేమ సంఘాలు, మహావీరుడికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు వీర పాండ్య కట్ట బొమ్మన్ వేషధారణలో ఆయన ఉరితాడు పై చివరి క్షణాలలో పలికిన మాటలను జ్ఞాపకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అధికారులకు, వీర పాండ్య కట్ట బొమ్మన్ సంక్షేమ సంఘాల నాయకులకు ఇలయ కట్ట బొమ్మన్ వీర పాండ్య కట్ట బొమ్మను చిత్రపటాలను అందజేయడం విశేషం, అలాగే అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పలు సంఘాల ప్రతినిధులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
.................


All Rights Reserved By telugunewstimes
Print Save