ప్యారిస్ న్యూస్ : టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే, సీఎం విజయ్ తన తొలి అధికారిక సంతకాలు చేశారు.
ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా, ప్రమాణ స్వీకార వేదికపైనే కీలక దస్త్రాలపై ఆయన సంతకం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రెండు నెలల బిల్లింగ్ విధానంలో 500 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకానికి సంబంధించిన దస్త్రంపై విజయ్ తొలి సంతకం చేశారు.
అలాగే, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ‘సింగప్పెన్’ పేరుతో ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు.
ఇక రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణను కట్టుదిట్టం చేయడానికి ప్రత్యేక మాదక ద్రవ్యాల నిరోధక దళాన్ని ఏర్పాటు చేసే దస్త్రంపైనా ముఖ్యమంత్రి విజయ్ సంతకం చేశారు.