
చేరికలపై నాలుక మడతేసిన కెటిఆర్
కాంగ్రెస్‌ను తప్పు పడుతూ విమర్శలు
అయినా ఆగని కాంగ్రెస్ ఆకర్శణలు
హైదరాబాద్,జూలై9(ఇది నిజం): రాజ్యాంగ బద్దంగా అంటే..పార్టీలోని మెజార్టీ సభ్యులను విలీనం చేసుకుంటే తప్పులేదు..ఒక్కొక్కరిని చేర్చుకుంటేనే తప్పు...మేం పార్టీని రాజ్యాంగ బద్దంగా విలీనం చేసుకున్నాం... కాంగ్రెస్ అలా చేయలేదు.. అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ తాజాగా ఢల్లీి వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏకబిగిన చట్టబద్దంగా, ఎమ్మెల్యేలను వన్ థర్డ్ మెజార్టీతో విలీనం చేసుకోవాలన్న సూచన చేసినట్లు అయ్యింది. అయితే గతానికి భిన్నంగా కాంగ్రెస్ ఒకకో ఎమ్మెల్యేను చేర్చుకుంటోంది. ఇది నూటికినూరు పాల్లు తప్పే. ఈ విషయంలో అన్ని పార్టీలు ఇలాంటి వెర్రి చేష్టలే చేశాయి. ఎలా చేసినా...అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందుకు బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ మినహాయింపు కాదు. దీనిపై ఇప్పుడు కెటిఆర్ వగచినా లాభంలేదు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చట్టసభల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ.. అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందే శాసనమండలిలో తిరుగులేని పార్టీగా అవతరించాలని చూస్తోంది. అలాగే బిఆర్ఎస్ను కూడా దెబ్బతీసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసే పనిలో పడిరది. గతంలో కెసిఆర్ ఇదే చేశారు. ఇప్పుడు రేవంత్ అదే చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ శాసనమండలిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫోకస్
పెట్టింది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి సీరియస్‌గా అమలు చేస్తున్న కాంగ్రెస్.. అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ కసరత్తు ముమ్మరం చేశారు. అటు మండలిపై కూడా గురిపెట్టి.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను వరుసగా చేర్చుకుంటున్నారు. మెల్లగా మండలిలో బలం పెంచుకుంటున్నారు. మండలిలో గవర్నర్ కోటాలో రెండు ఖాళీలుండగా.. ప్రస్తుతం 39మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్కు 19మంది, కాంగ్రెస్‌కు 13మంది, బీజేపీ 1, ఎంఐఎం 2, స్వతంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ బలం ఐదుగురు ఎమ్మెల్సీలే. ఎంపీ ఎన్నికల సమయంలో పట్నం మహేందరం రెడ్డి చేరికతో అది ఆరుకు చేరింది. ఇటీవల ఒకేసారి ఆరుగురి చేరికతో.. కాంగ్రెస్ బలం 12కు పెరిగింది. తాజాగా చల్లా వెంకట్రామిరెడ్డి సీఎంను కలవడంతో ఆయన చేరిక కూడా లాంఛనమే అని తెలుస్తోంది. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం 13కు చేరనుంది. బీఆర్ఎస్కు చెందిన చాలామంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు తదుపరి హావిూ ఇస్తే అన్న రీతిలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హావిూ ఇవ్వలేమని పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యనేతలు భరోసా ఇస్తున్నారు. మండలిలో 2/3 మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయొచ్చు అనే భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరో 9 మందిని పార్టీలోకి ఆకర్షించి 2/3 మెజారిటీ కంప్లీట్ చేసే యోచనలో ఉంది కాంగ్రెస్. పెద్దల సభలో బలం పెంచుకుని.. హస్తగతం చేసుకోవాలని.. కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే మండలిలో మెజారిటీ చాలా అవసరం. ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యతను సీఎం రేవంత్ పలువురు మంత్రులకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మండలి విషయంలో వేగంగా అడుగులు వేయడానికి కారణాలు లేకపోలేదు. తాను ప్రత్యక్షంగా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిషత్తు కోసం కాంగ్రేస్ పార్టీలో చేర్పించి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే అసెంబ్లీ సమావేశాలకు ముందే మెజార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గుత్తా కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆషాడానికి ముందే టాస్క్ పూర్తి చెయ్యాలని, బీఆర్ఎస్ వైఫల్యాలు వారితోనే చెప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కొన్నిచోట్ల చేరికలను స్వాగతిస్తుంటే, మరికొన్ని చోట్ల వ్యతిరేకత వినిపిస్తోంది. అందుకే ఈ చేరికలపై బిఆర్ఎస్ ఏడుపు మొదలు పెట్టింది. ఇలాంటి అనుభవం తమకు కూడా వస్తుందని ఆనాడు ఊహించలేక పోయింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విధానాన్ని విమర్శిస్తోంది
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com