
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టాయి. కూటమి పార్టీ విజయడంకా మోగించడమే కాకుండా చివరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడంతో ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు సైలెంట్ అయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వాళ్లలో పెద్దిరెడ్డి మినహా అందరూ ఓడిపోయారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీతోపాటు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం అధ్యక్షుడు చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన మంత్రుల్లో ముందు వరుసలో ఉన్నారు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు,ఎమ్మెల్యే వల్లభనేని వంశి. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారం చూసుకొని ప్రతిపక్ష నాయకుడిపై నోటికొచ్చినట్లుగా విమర్శలు చేసిన వీళ్లంతా ఓడిపోగానే కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు. కాదు కాదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అధికారం చూసుకొని విర్రవీగితే .. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లోని కొందరు వైసీపీ నాయకులకు ఇప్పుడు అర్దమవుతోంది.పార్టీ అధ్యక్షుడు, సీఎం మెప్పు కోసం ప్రతిపక్ష పార్టీపై విమర్శలు, ప్రతిపక్ష నాయకుడ్ని కించపరిచే విధంగా కామెంట్స్ చేసిన వారిలో ఫస్ట్ ఉండే వ్యక్తి మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ టికెట్ ఇవ్వడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొడాలి నాని .. ఆ తర్వాత రెండు సార్లు సైకిల్ గుర్తుతో గెలిచారు. అనూహ్యంగా జగన్ పార్టీలో చేరిన కొడాలి నాని గడిచిన ఐదేళ్లు చంద్రబాబును, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, ఆయన పరువును దిగజార్చే విధంగా వ్యక్తిగతంగా కించపరచడం చేశారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం, వైసీపీ ఓడిపోవడంతో కొడాలి నాని స్వరంలో మార్పు వచ్చింది.టీడీపీ వర్గీయుల దాడితో భయపడిపోయిన కొడాలి నాని ఆరోగ్యం బాగోలేదని అండర్ గ్రౌండ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.చంద్రబాబు గెలిస్తే ఆయన కాళ్ల దగ్గర షూ పాలిష్ చేసుకుంటాన్న వ్యక్తి కొడాలి నాని. ఓడిపోయిన తర్వాత తన ముఖం ఎక్కడ చూపించుకోవాలో తెలియక ఇప్పుడు సైలెంట్ అయిపోయారనే టాక్ వినిపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో కొడాలి నానిపై విపరీతంగా ట్రోల్స్ చేశారు టీడీపీ శ్రేణులు.
ఇక సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరో వ్యక్తి ఆర్కే రోజా. టీడీపీ ప్రోత్సాహంతో పదేళ్లు అదే పార్టీకి సేవ చేసినా తనను గుర్తించలేదని వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న 5ఏళ్లలో రోజా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణపై నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. రోజా ఓటమికి నోటి దూల మాత్రమే కాదు సొంత పార్టీలో కూడా ఆమె తీరు నచ్చకనే ఓడించారనే టాక్ ఉంది. ఈమె కూడా చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రోజా మకాం ఏపీలో కాకుండా హైదరాబాద్, చెన్నైకి మార్చినట్లుగా తెలుస్తోంది. ఇకపై రోజాకు రాజకీయ భవిష్యత్తు లేదనే భావించే మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రోజూ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, టీడీపీని కడిగిపారేసిన రోజా ..ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేసుకుంటున్నారు.
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన అంబటి రాంబాబు కూడా చంద్రబాబును విమర్శించిన వాళ్లలో టాప్ ప్లేసులోనే ఉన్నారు. ఈయన కూడా చంద్రబాబును పదే పదే మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, రాష్ట్రానికి ఏమి చేయని నేత అంటూ చులకన చేసి మాట్లాడారు.ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ప్రభావమో లేక టీడీపీపై జనం చూపిస్తున్నఅభిమానమో తెలియదు ..ఇప్పుడు మాత్రం అంబటి రాంబాబు మీడియా కంట పడకుండా, కనిపించకుండా తిరుగుతున్నారని టీడీపీ వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. కనిపిస్తే దాడులు చేస్తారో లేక గతంలో ఆయన చేసిన విమర్శలపై కౌంటర్లు వేస్తారని భయపడి అజ్ఞాతంలో గడుపుతున్నారు అంబటి రాంబాబు.జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన అంబటి తనకు పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు అర్ధం కాలేదని చెప్పడం కొసమెరుపైతే ఆయనే కనిపించటం లేదంటా కామెంట్స్ వస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ గా ఉన్న కాస్త గుర్తింపుతో చంద్రబాబు కంట్లో పడ్డారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. బాబుగారిచ్చిన ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన వ్యక్తి …షడన్ గా వైసీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు వల్లభనేని వంశీ. కేవలం రాజకీయ ప్రాపకం కోసం చంద్రబాబును విమర్శించడమే కాకుండా ఆయన సతీమణి, కుమారుడు లోకేష్ పై కూడా వర్ణించలేనంత నీచంగా మాట్లాడి టీడీపీ నేతలకే కాదు ..ఏపీ ప్రజలకు కార్నర్ అయ్యారు. దీంతో మొన్న జరిగిన ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఓడించారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో భయపడిపోయి అమెరికా వెళ్లారనే టాక్ వినిపిస్తుంది.
ప్రజలు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి పదవులు చేపట్టిన ఈ నలుగురు కేవలం వ్యక్తిగత ప్రాపకం కోసం టీడీపీని, చంద్రబాబును విమర్శించడం కోసమే తమ స్థాయిని తగ్గించుకొని…తమకు అప్పగించిన బాధ్యతను విస్మరించి ప్రజల్లో పలచుకన అయ్యారని టాక్ ఉంది. అందుకే వీళ్లు నలుగురు జనంలో ముఖం చూపించుకోలేక ..టీడీపీ నేతల ట్రోల్స్, వాళ్ల కామెంట్స్ కి భయపడి తలదాచుకుంటున్నారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి.