హైదరాబాద్ న్యూస్ :మండల కేంద్రంలో చైనా మాంజాతో సుభాష్ నగర్ కు చెందిన అద్నాన్ (18) యువకుడి గొంతు మంగళవారం తెగింది. మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియా ప్రాంతంలో చైనా మాంజాతో ఉన్న పతంగ్ తెగిపోవడంతో పట్టుకునేందుకు ప్రయత్నించిన అద్నాన్ మెడకు చుట్టుకుంది.
మెడకు చుట్టుకొని గొంతును కత్తిరించగా తీసేందుకు చేతితో ప్రయత్నించగా కుడి చేతి వేళ్ళు సైతం తెగాయి. దీంతో స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా గొంతుకు నాలుగు, చేతి వేళ్లకు నాలుగు కుట్లు పడ్డాయి. చైనా మాంజ యువకుడి ప్రాణం మీదికి వచ్చినట్లయితే. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వెంకటేష్ మెడకు మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేసి క్షతగాత్రుని పటాన్ చెరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు వెంకటేష్ వికారాబాద్ వాసి కాగా.. పటాన్ చెరు నుండి శంకర్ పల్లికి వెళ్తుండగ ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com