Logo
Date of Publish : 06 February 2026, 8:45 pm
Editor : CH. MUKUNDARAO

ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ భారత్‌ ఖాతాలోకి!

హరారె వేదికగా జరిగిన అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌ పోరులో ఇంగ్లాండ్‌పై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో భారీగా 412 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో వైభవ్‌ సూర్యవంశీ అసాధారణ ప్రతిభ చూపిస్తూ 175 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌ భారత విజయానికి పునాది వేసింది.
413 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 311 పరుగులకే ఆలౌటైంది. ఫాల్కనర్ శతకం చేసినప్పటికీ అది జట్టుకు ఉపయోగపడలేదు.
భారత బౌలింగ్‌లో అంబ్రిష్‌ 3 వికెట్లు పడగొట్టగా, దీపేశ్‌ మరియు కనిష్క్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఖిలాన్‌ మరియు ఆయూష్‌ ఒక్కో వికెట్‌తో ఇంగ్లాండ్‌ పతనాన్ని వేగవంతం చేశారు.ఈ ఘన విజయంతో భారత్‌ మరోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుని యువ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది.

 


All Rights Reserved By telugunewstimes
Print Save