Logo
Date of Publish : 06 July 2024, 8:56 pm
Editor : CH. MUKUNDARAO

కాకినాడ 8అర్బన్‌ గ్రామాల విలీనంపై ‘స్టే’ తొలగించాలి

ప్రభుత్వ కార్యాచరణ కోరుతూ 100రోజుల అజెండా చేపట్టిన పౌరసంక్షేమ సంఘం

కాకినాడ, జూలై 06 : 13ఏళ్లుగా స్థానిక పాలనకు దూరమైన 8అర్బన్‌ గ్రామాలను కాకినాడలో కలిపేందుకు అడ్డంకిగా వున్న హైకోర్టు ‘‘స్టే’’ రద్దుకు ప్రభుత్వం తక్షణచర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు వంద రోజుల కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల 42,48 డివిజన్లకు చెందిన గంగనాపల్లి టీచర్స్‌ కాలనీల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమై గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం గ్రామ సమస్యల వినతి పత్రాలు అమరావతికి సైకిల్‌ యాత్ర స్టే ఆర్డర్‌ పై ఇంప్లీడ్‌ పిటిషన్‌ చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి పౌర సంఘం వినతి పత్రం వెళ్లిందని డిప్యూటీ సిఎం కొణిదల పవన్‌ కళ్యాణ్‌, సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు వనమాడి వేంకటేశ్వరరావు (కొండబాబు), పంతం వేంకటేశ్వరరావు (నానాజీ), కాకినాడ విస్తరణ కోసం గ్రేటర్‌ ఏర్పాటు చేయించాలన్నారు. పౌర సంఘం కన్వీనర్‌ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో కన్వీనర్‌ చింతపల్లి అజయ్‌కుమార్‌, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పెద్దింశెట్టి రామకృష్ణారావు, మేడిశెట్టి వేంకటరమణ, జోగా అప్పారావు, ఎం.ప్రసాద్‌, రాంబాబు, మోహన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 11న తూరంగి 13న వలస పాకల పౌర సమావేశాలు  జరుగుతాయని తెలియజేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save