చెన్నై న్యూస్: దేవుని సేవలో, చర్చి నిర్వహణలో మహిళల పాత్ర ఎంతో గణనీయంగా ఉందని ఈ సీఐ ఆల్ ఇండియా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, చెన్నై డయాసిస్ బిషప్ కదిరోలి మాణిక్యం అన్నారు. చెన్నై న్యూ ఆవడి రోడ్డు , గాంధీనగర్ లో ఉన్న ఈసీఐ బెరాక తెలుగు చర్చిలో స్త్రీల సహవాసం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్త్రీల సహవాస కూడిక ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ ఆరాధనకు ఈసిఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బిషప్ డాక్టర్ ఈ కదిరోలి మాణిక్యం పాల్గొన్నారు. ముందుగా క్రైస్తవ భక్తి గీతాలు స్త్రీల సమాజం వారు ఎంతో భక్తిశ్రద్ధలతో దేవునికి మహిమ కరంగా ఆలపించారు. అనంతరం బిషప్ కదిరోలి మాణిక్యం ను స్త్రీల సమాజం తరఫున సత్కరించారు.
ఈ సందర్భంగా బిషప్ కదిరోలి మాణిక్యం దైవ వాక్యాన్ని బోధిస్తూ బైబిల్ గ్రంధంలో ఎంతోమంది స్త్రీలు దేవుని సేవను చేశారని, ఎస్తేరు, రూతు, మరియా తదితర స్త్రీలు చేసిన దేవుని సేవను వివరించారు. ప్రస్తుత సమాజంలో దైవ సేవలో చర్చిల నిర్వహణలో సంఘ అభివృద్ధిలో స్త్రీలు ఎంతో ఘననీయమైన పాత్రలు పోషిస్తున్నారని ఆమె కొనియాడారు. కుటుంబాలను కట్టుకోవడంలో స్త్రీలు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్నారని చెప్పారు.
అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం నాగభూషణం, పాస్టర్ యు తిమోతి, రేవరెండ్ డి బాలరాజు, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు.
.................
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com