
టి నగర్ న్యూస్ :చెన్నై, బ్రాడ్వే104 ప్రాంతంలోని సెయింట్ గాబ్రియేల్ స్కూల్ ప్రాంగణంలో సీబీఎఫ్ యువజన బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన క్రీస్తు మరణ–పునరుత్తాన మహోత్సవం విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీబీఏఫ్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు మాట్లాడుతూ, “యేసు క్రీస్తు మరణం, పునరుత్థానం చరిత్రాత్మక ఘటనలు. దీనికి చరిత్ర, పురావస్తు ఆధారాలు స్పష్టంగా మద్దతు ఇస్తున్నాయి. యేసు సమస్త మానవాళిని ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమతో జీవించాలి” అని ప్రజలకు సందేశం అందించారు.
ఈ సందర్భంలో నేపోలియన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ, “మేము అనేకులు చంపి రాజ్యాలు సాధించాం. కానీ యేసు తన ప్రేమతో రక్తం కార్చి రాజ్యం నిర్మించారు. ఆయన ప్రేమ సామ్రాజ్యం, అది ఎప్పటికీ నిలిచే రాజ్యం” అని వివరించారు.
అలాగే స్వామి వివేకానంద రాసిన “జ్ఞాన దీపం” గ్రంథంలో క్రీస్తు గురించిన వ్యాఖ్యలను ప్రదర్శిస్తూ డాక్టర్ వసంత బాబు ప్రజానీకానికి ఆత్మవిశ్వాసం నింపారు.
ఈ కార్యక్రమంలో కవి సుధా రమణి రచించిన “అపారమైనది నీ కృప” అనే పాటకు జడ జస్టిన్ పాల్ సంగీతం అందించగా, విశ్వ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జడ విశ్వవాణి ఆవిష్కరించారు.
పదిహేను ఏళ్లకే సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జడ జస్టిన్ పాల్ ప్రతిభను ప్రశంసిస్తూ రైట్ రెవరెండ్ రిక్టర్ ఆనందా గారు అతిథిగా పాల్గొన్నారు. సువార్త గాయకులు కె. ఆనంద్ బాబు, జె. జస్టిన్ పాల్ నేతృత్వంలో క్వయర్ పాడిన గీతాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి.జి. రవి వందన సమర్పణతో ఈ మహోత్సవం ముగిసింది.