ప్రభుత్వ ఖాళీల భర్తీకి తోణ చర్యలు
ఫైర్మెన్ పాసింగ్ ఔట్ పరేడ్లో సిఎం రేవంత్
ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని సిఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశామన్నారు. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో భర్తీ అయిన 483 మంది ఫైర్మెన్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వీరంతా నాలుగు నెలలుగా తీసుకుంటున్న శిక్షణ పూర్తయింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న మిమ్మల్ని చూసి విూ తల్లిదండ్రులు గుండెలనిండా సంతోషిస్తున్నారని అన్నారు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన విూ అందరినీ అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతోందన్నారు. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వం పై విశ్వాసం కల్పించామని రేవంత్ తెలిపారు. 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60 వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామ న్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు. వారికి ఏవైనా సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని రేవంత్ తెలిపారు. విూ సమస్యలను పరిష్కరించేందుకు విూ రేవంతన్నగా విూకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com