పిఠాపురం, జూలై 05 : పట్టణంలో మౌళిక సదుపాయాలు అభివృద్ధి కొరకు శంఖుస్థాపన చేసిన శిలాఫలకాలను తొలగిస్తున్న దానిపై వివరణ కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కి తెలుగుదేశం పార్టీ శ్రేణలు వినతి పత్రం అందజేసారు. ఈ సంధర్భంగా పార్టీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పట్టణంలో మౌళిక సదుపాయాలు అభివృద్ధి కొరకు శంఖుస్థాపన చేసినటి వంటి పలు శిలాఫలకాలు కొందరు దుండగలు తొలగించారన్నారు. వారు ఎవరి ఒత్తిడి మేరకు తీసివేసారో తమకు తెలియజేయాలని ఇవన్ని పథకం ప్రకారమే తీసివేయడం జరుగుతుందన్నారు. వాటిని తొలగించిన దోషులను తమ ముందర పెట్టాలని, సి.సి.కెమెరాలో గల పుటేజ్ బయటకు తీయించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని, వారిని పోలీస్‌లకు అప్పగించాలని కోరారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ఎడమ వైపు గల శిలాఫలకం ఇటీవల తొలగించడం జరిగింది. ఇది ఎవరు, ఎందుకని తొలగించారో తక్షణమే విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోని, తొలగించిన శిలాఫలకాన్ని యథాస్థానంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వర్మ పేరు కనపడకూడదని గత పాలకులు చేస్తునటి వంటి దుర్మార్గపు ఆలోచన దుస్థితి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి సూర్యప్రకాష్, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, పంపనబోయిన అన్నపూర్ణ, రాయుడు శ్రీను, పిల్లి చిన్న, అడ్డూరి శ్రీను, కర్నాసుల రాజా, అందుగుల సత్తిబాబు, అందుగుల పద్దరాజు తదితరులు పాల్గొన్నారు.