టి నగర్ న్యూస్: దేశ క్షేమం, సరిహద్దులో సమాధానం, ఈసీఐ సంఘాల అభివృద్ధి, తదితర అంశాల కోసం ఈ సీఐ సౌత్ఆంధ్ర డయాసిస్ బిషప్ డాక్టర్ ఆర్కే ఏబేలు నీలకంఠ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఈసీఐ ప్రధాన కార్యాలయంలోని బిల్లీ గ్రహం ఆడిటోరియం, ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం ప్రార్ధించిన ప్రార్థన గోపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ క్షేమం, సరిహద్దులో సమాధానం, ఈ సి ఐ సంఘాల అభివృద్ధి, ఐ ఎం ఎం సేవ, నూతన సంఘాల నిర్మాణం తదితర అంశాలపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఐ ఎం ఎం డైరెక్టర్ రెవ వెస్లీ సత్య, బిషప్ కమీషనరీ రెవ డి సురేష్ నాథ్, డయాసిస్ ట్రెజరర్ రెవ వి యోహన్, సభ్యులు రెవ డి బాలరాజు, రెవ ఎం ఎన్ భూషణం, రెవ డి సిలువ, పాస్టర్ సిహెచ్ ముకుందరావు, తదితరులు పాల్గొని ప్రత్యేక పాటలు పాడి ,ప్రార్థనలు చేశారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com