ఘనంగా సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ సేవకుల సదస్సు

విల్లివాకం న్యూస్: సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ ఆధ్వర్యంలో సేవకుల సదస్సు సోమవారం ఉదయం చెన్నై, పెరియమేడులోని సాల్వేషన్ ఆర్మీ హాలులో సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రెటరీ బ్రదర్ ఎన్ విజయకుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జర్మనీ దేశానికి చెందిన పాస్టర్ ఆల్ఫ్రెడ్, బ్రదర్ ఎడుయార్డ్, సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ ఫౌండర్ డాక్టర్ వి శ్యామ్, బ్రదర్ విక్టర్, బ్రదర్ తిమో విచ్చేశారు.

అనంతరం జరిగిన సభలో ఫౌండర్, డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ వి శ్యామ్ కార్యక్రమాన్ని నడిపించారు. ముందుగా భారతీయ సాంప్రదాయం ప్రకారం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆల్ఫ్రెడ్ యోహాను సువార్త 12:26 వచనం ఆధారంగా దైవ వాక్యాన్ని బోధించారు. జనరల్ సెక్రటరీ సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ గత 15 ఏళ్లుగా భారత దేశంలో పలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని కనిగిరి, ఉదయగిరి, పామూరు, పొదిలి, వింజమూరు తదితర ప్రాంతాలలో దైవ సేవకులకు సహాయ సహకారాలు అందిస్తూ, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ, డయాలసిస్ చేయించుకునే వారికి భోజన ఏర్పాట్లను చేస్తూ, సేవకులకు నిత్యావసర వస్తువులు, చర్చ్ నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. మొట్టమొదటిసారిగా చెన్నై పట్టణంలో తెలుగు బాప్టిస్ట్ సంఘాలు, సంస్థల సేవకులకు ఈ సదస్సు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఈ సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ ద్వారా అనేక సంఘాల నిర్మాణం, సేవకులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టామ్స్ డైరెక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు, వైస్ ప్రెసిడెంట్ దేవదానం, స్వర్ణ జయపాల్, ట్రెజరర్ బిఎన్ బాలాజీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ జడ సుబ్బారావు, పాల్గొన్నారు. అలాగే చెన్నై పట్టణంలో ఉన్న పలు సంఘాల దైవ సేవకులు పాల్గొన్నారు. ఇందులో పాస్టర్లకు బహుమతులు అందజేశారు. చివరిగా అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. వ్యాఖ్యాతగా పాస్టర్ రెవ.వి. జేసుదాసు వ్యవహరించారు.
………….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి