
ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి సంప్రదాయాల ప్రకారం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి బాధ్యత తీర్చుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన తల్లి శవానికి అంత్యక్రియలు జరపలేదు.
మృతదేహాన్ని మూడు నెలలకు పైగా బెడ్ పైనే ఉంచేశాడు. ఈ షాకింగ్ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటుచేసుకుంది. తల్లి చనిపోయినా ఏమీ తెలియనట్లుగా రోజూ ఆమెకోసం ఆహారం తెచ్చేవాడు. బ్యాంకుకి వెళ్లి డబ్బులు డ్రా చేసేవాడు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులతో ఎంక్వైరీ చేయించగా బెడ్‌పై చెదలు పట్టి ఉన్న మహిళ అస్థిపంజరం కనిపించింది. ఈ ఘటన వైరల్ అవుతోంది.
గువాహటిలోని జ్యోతికుచి ఏరియాలో పోలీసులు పూర్ణిమ దేవ్ అనే మహిళ అస్థిపంజరాన్ని ఆమె ఇంట్లో రికవర్ చేశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పూర్ణిమ దేవ్ భర్త రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ కాగా, ఆయన చనిపోయారు. అప్పటినుంచి కుమారుడు జయ్‌దీప్ దేవ్(40)తో కలిసి పూర్ణిమ నివసిస్తోంది. ఇరుగు పొరుగు వారితో కలివిడిగా మెదిలే పూర్ణిమ కొన్ని రోజులగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి సందేహం వచ్చింది. ఎప్పుడు చూసినా ఆమె ఇల్లు తాళం వేసి ఉండటం, ఇంటి పరిసరాలు చెత్తాచెదారంతో నిండి ఉండటంతో కుమారుడు జయ్‌దీప్ దేవ్‌ను ఆరా తీశారు.
ఇంటిని క్లీన్ చేయాలని తోటివారు చెప్పగా.. 'మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మా అమ్మ కూడా చనిపోయింది. నాకు మరొకరు తోడు దొరికే వరకు క్లీన్ చేయను' అని రిప్లై ఇచ్చాడట. దీంతో ఆమె మరణించిందనే అనుమానంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా బెడ్‌పై పడుకున్న స్థితిలో ఒక స్కెలిటన్ కనిపించింది. ఇన్వెస్టిగేషన్ చేయగా.. మొదట్లో జయ్‌దీప్ దేవ్‌కి మానసిక సమస్య ఉందని గుర్తించారు. తల్లిని అస్సలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లనిచ్చేవాడు కాదట. అలా కొన్నేళ్లుగా తల్లిని ఇంటికే పరిమితం చేశాడు. పైగా, తనకు ఎలాంటి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. తల్లికి వచ్చే పెన్షనే వీరికి ఆదాయ వనరు. దీంతో డబ్బుల కోసం ఏటీఎంకి వెళ్లి వచ్చేవాడు. తనకు, తన తల్లికి ఫుడ్ కూడా బయట నుంచే తెచ్చేవాడని పోలీసులు భావించారు.
ఎన్నో అనుమానాలు
జయ్‌దీప్ దేవ్ మానసిక వికలాంగుడని అనుకుంటే.. బయటకు వెళ్లి ఏటీఎంలో ట్రాన్సాక్షన్లు ఎలా చేస్తున్నాడనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తి ఇతరులతో ఎలా మాట్లాడగలడనే డౌట్ వచ్చింది. తన తల్లి చనిపోయిందని ఇతరులకు చెప్పిన జాయ్సింగ్.. ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేయాలన్న విషయం తెలియదా? మరి, ఈ విషయం ఇతరుల వద్ద ఎందుకు దాచిపెట్టాడనే అనుమానం కలుగుతోంది.
మూఢ నమ్మకంతో ఇలా చేశాడా?
పోలీసులు ఇంట్లోకి వెళ్లినప్పుడు స్కెలిటన్తో పాటు అక్కడ శివుడి ఫొటో, దూప్ స్టిక్స్, దీపం, నైవేద్యం కోసమని పెట్టిన కొన్ని ఫుడ్స్ కనిపించాయట. దీంతో పాటు తాను ప్రతి రోజు 'ఓం నమః శివాయ' మంత్రం జపిస్తున్నట్లు ఇంటరాగేషన్‌లో జయ్‌దీప్ పోలీసులకు వెల్లడించాడు. అంటే, మృత్యుంజయ మంత్రం జపిస్తే తన తల్లి ఎల్లప్పుడూ బతికే ఉంటుందన్న నమ్మకం అతడిలో కలిగి ఉండాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.
.....
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com