విల్లివాకం: చెన్నై, కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీ కోదండ రామాలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలతో అలంకరించి వేడుకలను ఆరంభించారు. అనంతరం కొత్త మట్టి కుండల్లో పొంగలి వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ప్రసాదం వినియోగం చేశారు. ముగ్గులు, వంటలు పోటీలు నిర్వహించగా, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నుంగంబాక్కంలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు సంక్రాంతి విశిష్టతపై ప్రదర్శించిన నాటిక అందరినీ అలరించింది. ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు , కార్యదర్శి జె. శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, సలహాదారులు ఎమ్మెస్ మూర్తి, ఉపాధ్యక్షులు కేఎన్ సురేష్ బాబు,ఇంకా ఎంఎస్ నాయుడు, ఓ. మనోహర్, సహా కార్యవర్గ సభ్యులు, మహిళ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముగ్గులు, వంటల పోటీల విజేతలకు బహుమతులుగా 4 పి ఇంటర్నేషనల్ బెల్లంకొండ బ్రదర్స్ తరపున సిల్వర్ కాయిన్ లు, పోటీల్లో వారికి, న్యాయ నిర్ణేతలకు, అధ్యాపకులకు ఐఎస్ పి గ్రూప్ తరపున ఆయిల్ ప్యాకెట్లు బహమతులుగా అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో న్యాయనిర్ణేతలుగా శేషారత్నం, అన్నపూర్ణ, రాధిక, కల్పన, ఇందుమతి , అలాగే క్రీడా పోటీలకు గజగౌరి, విఎన్ హరినాధ్ వ్యవహరించారు. వేడుకల్లో ముందుగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .ఈ సందర్భంగా ఆంధ్ర కళా స్రవంతి తరపున తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు 300 మందికి సంక్రాంతి విందును అందించారు.
........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com