విళ్లివాకం న్యూస్: కాపు సేవా సమితి, చెన్నై ఆధ్వర్యంలో 'సంక్రాంతి సంబరాలు' ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. దీనికి చెన్నై, అన్నానగర్, 6వ మెయిన్ రోడ్డులో గల శ్రీకృష్ణస్వామి మహిళా కళాశాల ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఆకుల ప్రకాష్ అధ్యక్షత వహించి 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు.
ముఖ్య అతిథిగా విద్యావేత్త పి.యం కన్నదాసన్ విచ్చేశారు. గౌరవ అతిథులుగా కృష్ణస్వామి మహిళా కళాశాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నళిని పాల్గొన్నారు. ఇందులో లక్కీ డిప్ ఈవెంట్, రంగోలి, పాటల పోటీలు, కుకింగ్ పోటీలు జరిగాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంస్థ అధ్యక్షులు గూడపాటి జగన్మోహనరావు స్వాగతం ఉపన్యాసం చేశారు. ప్రధాన కార్యదర్శి పి.ఆర్ కేశవులు ప్రార్థన గీతం ఆలపించారు.నారాయణ పెరల్స్ అధినేత కొట్టే వెంకట నారాయణ , పారిశ్రామికవేత్త సత్యనారాయణ, బేతి రెడ్డి శ్రీనివాస్ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆధ్యాంతం ఎంతో ఉత్సాహంగా, హుషారుగా సాగింది.




Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com