విళ్లివాకం న్యూస్: చెన్నై జార్జ్ టౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఐక్యుఏసి, సృజన తెలుగు భాష మండలి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్ విభాగాల పోటీలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలకు ప్రిన్సిపల్ ఇంచార్జీ డాక్టర్ పి.బి.వనిత అధ్యక్షత వహించగా, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ మైధిలి, ఐక్యూఏసి కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.భరణి కుమారిలు పోటీలను పర్యవేక్షించి, స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా టీవీ ఫేమ్ పాక నిపుణురాలు ఎస్. మల్లిక బద్రినాథ్ పాల్గొన్నారు. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా పోటీల్లో పాల్గొన్నారు. పోటీ వివరాలు 1.తెలుగు భాష మాధుర్యం(వ్యక్తిగత పోటీ)
2.మన తెలుగు _ మన వెలుగు( సామూహిక పోటీ) అలాగే మన తెలుగు- మన వెలుగు సామూహిక పోటీల్లో విద్యార్థినిలు తమదైన ప్రతిభను ప్రదర్శించారు. జానపద పాటలకు నృత్యాలతో అలరించారు. విద్యార్థులు వివిధ రకాల పోటీలలో పాల్గొన్నారు. పదాలను సరిదిద్దడం, టంగు ట్విస్టర్ వంటి వాటిల్లో ప్రతిభను చూపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ కరస్పాండెంట్ చిన్ని బాలాజీ ఆసీసులతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందించారు. ముఖ్య అతిథి మల్లిక బద్రీనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడే రీతిలో హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోనేందుకు కృషి చేయాలన్నారు. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్నారు. మాతృభాష మరువద్దని హితవు పలికారు.
............
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com