Logo
Date of Publish : 21 September 2024, 3:42 pm
Editor : CH. MUKUNDARAO

ఏపీలో ‘దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతి

అమరావతి న్యూస్ :ఏపీలో ‘దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతిఎన్టీఆర్‌ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ‘దేవర’ ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ ధరలు, స్పెషల్‌ షోల విషయంపై ఇటీవల ‘దేవర’ టీమ్‌ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. ఈ మేరకు తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్‌ ఇచ్చింది. అలాగే టికెట్‌ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది.


All Rights Reserved By telugunewstimes
Print Save