అమరావతి న్యూస్:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ వైద్య చికిత్స అనంతరం తాజాగా ఇండియాకు తిరిగి వచ్చాడు. పవన్ కల్యాణ్ మరియు ఆయన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి మార్క్ శంకర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో అతను విదేశాల్లో చికిత్స తీసుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం మార్క్ శంకర్ పరిస్థితి మెరుగ్గా ఉందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ల సూచనల మేరకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, అందుకే అతడిని ఇంట్లోనే ఉంచి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మార్క్ శంకర్ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
[video width="720" height="960" mp4="https://telugunewstimes.com/wp-content/uploads/2025/04/1000161900.mp4"][/video]
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com