Logo
Date of Publish : 05 May 2025, 4:58 pm
Editor : CH. MUKUNDARAO

తమిళ మత్స్యకారులకు మద్దతుగా పవన్ కళ్యాణ్

– శ్రీలంక చర్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం

చెన్నై: ఇటీవల బంగాళాఖాతంలో చోటుచేసుకున్న ఘటనా సమాహారంలో, శ్రీలంక నౌకాదళం 24 మంది తమిళనాడు మత్స్యకారులపై దాడికి దిగిన ఘటన తీవ్ర స్థాయిలో ఖండనకు గురవుతోంది. ఈ విషయమై పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతును వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "బంగాళాఖాతంలో 5 వేర్వేరు ఘటనల్లో తమిళనాడు మత్స్యకారులపై జరిగిన దాడులు తీవ్రమైన విషయాలు. ఇది మానవహక్కుల ఉల్లంఘన. అలాంటి అమాయక మత్స్యకారులపై దాడి చేయడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి" అని పవన్ తన X (హెచ్‌టీ ట్విట్టర్లో డిమాండ్ చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save