
న్యూఢల్లీి,జూలై6(ఇది నిజం): సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన వేళ..ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాస్టప్రతి ప్రసంగించారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2024`25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోమారు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించారు. 2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమర్పణ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారంనాడు ప్రకటించారు. జూలై 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయని,బడ్జెట్ సమావేశాల రెండో రోజైన జూలై 23న కేంద్రబడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని సామాజిక మాధ్యమం ’ఎక్స్’లో మంత్రి తెలిపారు. భారత ప్రభుత్వం సిఫారసుల మేరకు పార్లమెంటుబడ్జెట్ సమావేశాలు జరిపేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2024`25 కేంద్ర బడ్జెట్‌ను జూలై 23వతేదీన లోక్‌సకు సమర్పిస్తాం‘ అని రిజిజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఈసారి బడ్జెట్లో పలు చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నారనే అంచనాలు కూడా బలంగానే ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.