విల్లివాకం న్యూస్: విద్యార్థులు మాతృభాషలో చదివేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అఖిల భారత తెలుగు సమాఖ్య, అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా లభించినా ఇందుకు స్పందన లేకపోవడం శోచనీయమని అన్నారు. దేశ ప్రధానిగా నెహ్రూ ఉన్నప్పుడు త్రిభాషా సూత్రాన్ని అమలులోకి తెచ్చారని, తమిళనాట అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై హిందీ వ్యతిరేకోద్యమాన్ని ప్రారంభించారన్నారు. అయినప్పటికీ అన్నాదురై, ఎంజిఆర్ హయాంలో విద్యార్థులు మాతృభాషలో చదువుకునేందుకు వీలుకావడంతో ఇబ్బంది కలగలేదన్నారు. 2006లో కరుణానిధి నిర్బంధ తమిళ చట్టం అమలులోకి తీసుకు రావడంతో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ద్విభాష సూత్రంతో మాతృభాషలో చదివేందుకు వీలు కాలేదని, ఐచ్చికంగా చదువుకునేందుకు చట్టం తేవడంతో ఇందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదని, దీనిపై తాము రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని అన్నారు. 2008లో ఇదే వ్యవహారంలో మలయాళీయుల కేసు డిస్మిస్ అయినట్లు తెలిసింది. దీంతో మన కేసును అడ్మిట్ చేయలేదన్నారు. తాము తమిళం చదివేందుకు అభ్యంతరం లేదని అయితే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఎలా చదవగలరని ప్రశ్నించాము. హైకోర్టులో కేసు తర్వాత వృత్తి విద్య ఉపాధ్యాయులను మాత్రం అపాయింట్ చేశారని, తమిళ టీచర్స్ అపాయింట్ చేయలేదని అన్నారు. దీనిని వారు స్వయంగా ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో 2018, 19 వరకు విద్యార్థులకు పరీక్షలు రాయడంలో రిలీఫ్ ఇస్తూ వచ్చారు. 2019లో కలకత్తా నుంచి ఇందిరా బెనర్జీ చీఫ్ జస్టిస్ గా రావడం జరిగిందని, ఆమె మన అడ్వకేట్ ను మైనారిటీస్ కు అన్యాయమైన చట్టాన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఆ సమయంలో గవర్నమెంట్ ప్లీడర్ హైకోర్టు సుప్రీంకోర్టులో నిరాకరించబడినట్లు తెలిపారు. అందుకామె అది సరికాదని, హైకోర్టులో ఇద్దరు జడ్జిల బెంచ్ విచారణ జరిగిందని, ముగ్గురు జడ్జిల విచారణ అవసరం అన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో టెక్నికల్ గా అడ్మిట్ కాలేదు. అందుకని హైకోర్టులో మళ్లీ అడగండి ఇస్తామన్నారు. అందుకు ఆమె ఒక బెంచ్ ఏర్పాటు చేసి వెళ్లారు. కోర్టులో మళ్లీ తాము మాతృభాషలో చదివేందుకు వీలు కల్పించాలని, ప్రతి ఏడాది పొడిగింపు ఎందుకని ప్రశ్నించడం జరిగింది. దీనిపై మణికుమార్ అనే జడ్జి 9 నెలలు తీర్పు నివ్వనందున తాము రాష్ట్రపతికి లేక రాయగా రాష్ట్రపతి భవన్ నుంచి చీఫ్ సెక్రటరీకి లేఖ అందినట్లు తెలిపారు. అందులో ఎందుకు తీర్పునివ్వలేదు తెలియజేయాలని రిపోర్ట్ ఇవ్వమన్నారు. దీన్ని తాము ఏమాత్రం ఊహించలేదని, ఆ తర్వాత మూడు సంవత్సరాల పొడిగింపుతో 22 వరకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పొడిగింపు ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. 2023లో తప్పనిసరిగా రాయాల్సి ఉండడంతో ఎగ్జామ్స్ దగ్గర కావడంతో మళ్లీ ఒక ఏడాది పొడిగింపు ఇచ్చారు. సుప్రీం కోర్టు 23 సెప్టెంబర్ లో విద్యార్థులు తమిళ భాషకు వ్యతిరేకం కానప్పుడు మీకేమిటి అభ్యంతరం అని ప్రశ్నించిందన్నారు.

తల్లిదండ్రులకు అవగాహన అవసరం
ప్రస్తుత సమస్య ఏమిటంటే తల్లిదండ్రులు తమిళం వద్దు, ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. టీచర్, స్టూడెంట్ నిష్పత్తి లేకపోవడంతో వారిని వేరొక చోటికి బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి, వారిలో ఉద్యోగాలలో సమస్య వస్తుందన్న అభిప్రాయం ఉంది. నిర్బంధ తమిళం వల్ల మాతృభాష మనం చదవకుంటే ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది. అందువల్ల మాతృభాషను ప్రోత్సహించాలి. కనీసం 10 వ తరగతి వరకు మాతృభాషలో చదివించాలని కోరారు. తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ స్కీమ్ రిలీజ్ చేయలేదని, దీనిపై ఆర్.టి.ఐ కమిషన్ ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.
మాతృభాష పరిరక్షణలో ఏఐటిఎఫ్
ఏఐటిఎఫ్ రాష్ట్రంలో 50 ఏళ్లకు పైగా మాతృభాష, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతోంది. 12 ఏళ్లగా మాతృభాష సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది.

(అఖిలభారత తెలుగు సమఖ్య అధ్యక్షులు ఆచార్య సీఎం కే రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా టి ఎన్ టి న్యూస్ ప్రతినిధితో ముఖాముఖి)
.....................
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com