Logo
Date of Publish : 29 March 2026, 11:25 pm
Editor : CH. MUKUNDARAO

ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన

విళ్లివాకం న్యూస్: చెన్నై, పెరంబూరు పటేల్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర భక్త సమాజం, ఆళ్వారు పేట, ఉది కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం ఆదివారం ఉదయం ఆనంద నిలయం వేదికగా జరిగింది. దీనిని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త డి. జంబు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాదాపు 300 మందికి పరీక్షలు జరిపారు. 200 మందికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు.

అలాగే, అవసరమైన వారికి ఆస్పత్రిలో చేర్చి వెంటనే ఆపరేషన్లకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, ట్రెజరర్ హెచ్ వెంకట రమణుడు, సహాయ కార్యదర్శి పి రవి కుమార్, ట్రస్టీ పి రామచంద్రన్ తదితర కార్యవర్గ సభ్యులందరూ, జనని కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు.

 


All Rights Reserved By telugunewstimes
Print Save