Logo
Date of Publish : 12 May 2026, 12:51 pm
Editor : CH. MUKUNDARAO

NTA సంచలన నిర్ణయం.. మే 3న జరిగిన నీట్‌ పరీక్ష రద్దు!

దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్-2026 ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రాజస్థాన్‌లో బయటపడిన ప్రశ్నాపత్ర లీక్ ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు మరియు విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని NTA స్పష్టం చేసింది. తిరిగి పరీక్ష నిర్వహణ తేదీపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.


All Rights Reserved By telugunewstimes
Print Save