
విల్లివాకం న్యూస్: ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) నూతన కార్యవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షులు జి శశిధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వై. రాజేశ్వరరావు, గౌరవ కార్యదర్శి దిలీప్ కుమార్ వడ్లమూడి, సంయుక్త కార్యదర్శి మాదాల వెంకట సుబ్బారావు, కోశాధికారి ఎల్. శాంతకుమార్, సాంస్కృతిక కార్యదర్శి, సినీ నటుడు భానుచందర్ బాధ్యతలు చేపట్టారు. వీరందరికీ పూర్వ అధ్యక్షులు కే. సుబ్బారెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఇందులో కమిటీ సభ్యులు రమేష్ రెడ్డి, టీ రాజేష్, మదనగోపాల్ రావు, ఎస్పీ శ్రీనివాసులు, గోపాల్ కృష్ణారెడ్డి, వి. విజయేంద్ర రావు, కోటేశ్వరరావు, మనోహర్ రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆదిశేషయ్య, జెకె రెడ్డి, వాసురావు, బేతిరెడ్డి శ్రీనివాస్ సహా నగర ప్రముఖులు ఇతర ఆస్కా సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమైక్యంగా, సోదర భావంతో ఆస్కాను ముందుకు తీసుకు వెళ్లాలని, ఇందుకు తాము అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు. అధ్యక్షులు జి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తమ పానెల్ ను ఓటేసి గెలిపించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఇవి కేవలం పదవులు కాదని, బాధ్యతతో కలిసి పనిచేసే సంస్థకు పూర్వ వైభవం తీసుకువద్దామన్నారు. భానుచందర్ మాట్లాడుతూ ఆస్కాను అందరూ గర్వపడేలా ఉన్నత స్థితికి తీసుకు వస్తామని, కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
……….