Logo
Date of Publish : 02 July 2024, 7:33 pm
Editor : CH. MUKUNDARAO

కాకినాడ జిల్లా కేంద్రంలో దోమల తీవ్రత నివారించాలి

కాకినాడ, జూలై 02 : స్మార్ట్‌ సిటీలో పెరుగుతున్న దోమల నివారణకు లార్వా దశలో దోమల సంతతి వృద్ది చెందకుండా వుండేందుకు వినియోగించాల్సిన క్రిమిసంహారక మందులను కాలువల్లో స్ప్రే చేయడంలేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. అపారిశుద్ధ్య ప్రదేశాల్లో మురుగు బురద ప్రవహించిన సిమెంట్‌ రోడ్లపై ముఖ్యంగా చేపల మార్కెట్లు, రైతుబజార్లు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కూడా ముగ్గు, బ్లీచింగ్‌ జల్లించడంలేదన్నారు. మంత్రుల కాన్వాయ్‌ మార్గాలకు మాత్రమే ముగ్గు లైన్లు వేస్తున్నారన్నారు. డయేరియా బెడదతో బాటుగా మలేరియా, డెంగ్యూ ఆందోళన కలుగుతున్న దుస్థితి దోమల తీవ్రత కారణంగా ఏర్పడిరదన్నారు. నగరం బయటికి డంపింగ్‌ యార్డ్‌ వాహనాల యూనిట్లు సర్వీస్‌ కేంద్రాలు తరలింపు చేయకపోవడం వలన దుర్గంధం ఎదుర్కోవాల్సిన అవస్తలు తొలగడంలేదన్నారు. రోడ్లు ఎత్తు చేసిన వీధుల్లో కాలువల నిర్మాణం లేక టాయిలెట్స్‌ వ్యర్థాలతో మురుగు నిలిచిన బెడదతో దోమల తీవ్రత పెరుగుతున్నదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బడ్జెట్‌ ప్రజలకు తెలియకుండా గోప్యం తగదన్నారు. స్థానిక పన్నుల ఆదాయంతో దోమల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజారోగ్యం ప్రకటనలకు పరిమితం కావడం తగదని పౌర సంఘం కన్వీనర్‌ సామాజిక వేత్త దూసర్లపూడిరాజు నిరసన వ్యక్తం చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save