
చెన్నై న్యూస్: భారత స్వాతంత్ర్య పోరాటంలో అపూర్వ ధైర్యం, ధీరత్వం ప్రదర్శించిన మావీరన్ వీరపాండియ కట్టబొమ్మన్ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున గాంధీ మండపంలో ఘన నివాళులు అర్పించారు.
అధ్యక్షుడు ప్రొఫెసర్ సిఎం కె. రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాయక్కర్ ఆర్. నందగోపాల్, ఉపాధ్యక్షులు డాక్టర్ సిఎం కిషోర్, వి.జి. జయకుమార్, కోశాధికారి కెవి. జనార్దనన్, రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులతో కలిసి మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు మావీరన్ వీరపాండియ కట్టబొమ్మన్ జీవిత విశేషాలు, ఆయన దేశభక్తి, నిర్భయతను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. వారి త్యాగం ప్రస్తుత తరానికి పాఠసాంప్రదాయంగా ఉండాలని కోరారు.అనంతరం, జయంతి సందర్బంగా చరిత్రను గుర్తుచేసే అనేక సంస్మరణల కార్యక్రమాలు నిర్వహించారు.జయంతి వేడుకలకు గాంధీ మండపం మళ్లీ ఒక చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది.