
చెన్నై న్యూస్: మన ప్రాచీన మాతృభాష తెలుగును బ్రతికించుకొని పూర్వ వైభవం తీసుకొద్దామని ఐ సి ఎఫ్ జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు పిలుపునిచ్చారు. చెన్నై పెరంబూర్ లోని డి ఆర్.బి.సి.సి మహోన్నత పాఠశాల లో తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ సభకు సంఘ అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా యు సుబ్బారావు , విశిష్ట అతిథిగా మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ విస్తాలి శంకరరావు పాల్గొన్నారు. ముందుగా తిరువల్లూరు జిల్లా ఆరణి ఎం బి ఎస్ వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ ఎం.బి శాంతా భాస్కర్ నేతృత్వంలో చిన్నారులు తెలుగుతనం పుట్టిపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి యు సుబ్బారావు మాట్లాడుతూ…. మన మాతృభాష అయిన తెలుగులో మర్చిపోవద్దని దాన్ని బ్రతికించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే ఎంతో పురాతనమైన ఈ పాఠశాలలో జరిగిన ఈ తెలుగు ఉగాది కార్యక్రమంలో పాల్గొనడం నా జన్మ ధన్యమైంది అన్నారు. మన ప్రాచీన తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు.
అలాగే విశిష్ట అతిథి డాక్టర్ విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఉగాది యొక్క విశిష్టతను ప్రాధాన్యతను గొప్పదనాన్ని వివరించి సబికులను ఆలోచింపజేశారు. ఆత్మీయ అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత నర్రావుల వెంకటరమణ తమిళనాడుతెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది కార్యక్రమాలకు ఎన్నో ఏళ్లగా వస్తున్నానని ఎంతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. ముందుగా డాక్టర్ టి ఆర్ ఎస్ శర్మ విశ్వావసునామ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ పఠనం చేశారు.
సంఘ కార్యదర్శి పిఆర్ కేశవులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కే రమాదేవి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నిర్వాహకులుమన మాతృభాషను బ్రతికించుకుందాం .. యు శాలువులతో సత్కరించి ,చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కె వెంకటరాజు, తెలుగు ప్రముఖులు వంజరపు శివయ్య, కాకాని వీరయ్య, చల్లగాలి బాబు, ఉపాధ్యాయులు పి. కుమార్, తమిళనాడు తెలుగు ప్రజల సొసైటీ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు, తో పాటు పలువురు పాల్గొన్నారు.
………….