Logo
Date of Publish : 11 July 2026, 9:24 pm
Editor : CH. MUKUNDARAO

గానకోకిల ఎస్. జానకి కన్నుమూత

గానకోకిల ఎస్. జానకి కన్నుమూత

కోడంబాకం న్యూస్: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ ప్రముఖ గానకోకిల ఎస్. జానకి కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో ఎస్. జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 50 వేలకుపైగా పాటలు ఆలపించి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ముఖ్యంగా మలయాళం, కన్నడ భాషల్లో ఆమె అత్యధిక గీతాలు పాడారు.
ఏ భావాన్నైనా తన మధుర గానంతో సజీవంగా ఆవిష్కరించగల అరుదైన గాత్రమాధుర్యం ఆమె సొంతం. ఉత్తమ గాయనిగా నాలుగు జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 31 పురస్కారాలు అందుకుని భారతీయ సంగీత రంగంలో విశిష్ట స్థానం సంపాదించారు.
ఎస్. జానకి మరణం సినీ, సంగీత రంగాలకు తీరని లోటుగా అభిమానులు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
......


All Rights Reserved By telugunewstimes
Print Save