Logo
Date of Publish : 11 July 2024, 8:27 am
Editor : CH. MUKUNDARAO

కేతిరెడ్డి ఓటమిపై కెటిఆర్‌ విమర్శలు

మంత్రి సత్యకుమార్‌ ఘాటుగా ప్రతిస్పందన

ధరణిలాగే ఇక్కడా విూ నేతం భూ కబ్జాలు అంటూ విమర్శలు

ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడంపై బాధను వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్‌ కెటిఆర్‌ తీరుపై ఏపీ మంత్రి సత్యకుమార్‌ ఘాటు విమర్శలు చేశారు. విూరు ధరలణిలో భూములు కాజేసినట్లే ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్‌ఇ గుడ్‌మార్నింగ్‌ పేరుతో భూములను కబ్జా చేశారని అన్నారు. అందుకే ప్రజలు అతడిని ఓడిస్తే కెటిఆర్‌కు ఏమొచ్చిందని అన్నారు. ఈ ఇద్దరి మద్య భూ అనుబంధం ఉందా అని ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో మంత్రి సత్యకుమార్‌ సెటైర్లు, ఆయనను మాజీ మంత్రి కేటీఆర్‌ బ్లాక్‌ చేయడం.. రెండు తెలుగు రాష్ట్ర జకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఏపీ ఎన్నికల్లో జగన్‌ ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయన ఎక్స్‌ అకౌంట్‌ను కేటీఆర్‌ బ్లాక్‌ చేసేశారు. ఏపీలో వైఎస్సార్పీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని.. అలాగే నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఎలా ఓటమి చెందారనేది అర్ధం కావడం లేదంటూ కేటీఆర్‌ విూడియాకు తెలిపారు. దీనిపై ఏపీ మంత్రి సత్యకుమార్‌ స్పందిస్తూ.. తనదైన శైలిలో కేటీఆర్‌పై మాటల దాడికి దిగారు. దీంతో ఏపీ మంత్రి వ్యాఖ్యలను తట్టుకోలేక మాజీ మంత్రి కేటీఆర్‌ ఏకంగా ఆయన ట్విట్టర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేసేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్‌ చిలక పలుకులు పలుకుతున్నారు.. ధరణి పేరుతో తెలంగాణలో విూరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్‌ మార్నింగ్‌ పేరుతో విూ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్‌, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా 

కబళించాడు. గుడ్‌ మార్నింగ్‌ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా`కలెక్షన్‌`కరప్షన్‌`కవిూషన్లే. ఫాంహౌస్‌కు పరిమితమైన విూరు ఎక్స్‌లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. విూ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్‌లో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్‌ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని విూ ప్రియ మిత్రులు జగన్‌ కేతిరెడ్డిలను ఓడిరచాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ’సర్టిఫికేట్‌’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి‘ అంటూ ఏపీ మంత్రి సత్యకుమార్‌ ట్వీట్‌ చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save