పిఠాపురం, జూన్ 29 : కాకినాడ పార్లమెంటరీ సభ్యునిగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా దేశరాజదాని ఢిల్లీ నుంచి కాకినాడకు వచ్చిన కాకినాడ ఎం.పి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్‌ను, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ (జనసేన, తెలుగుదేశం, బిజెపి) ప్రభుత్వంలో రాష్ట్ర క్యాబినెట్ నందు ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక సాంస్కృతిక, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాకు విచ్చేసారు. కాకినాడలోని ఒక ప్రైవేటు హోటల్ నందు బస చేసిన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజాను జనసేన జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకెను అందజేస్తూ కాకినాడ ఎంపి, మంత్రులు ఇరువురికి, ప్రతిపాడు శాసనసభ్యురాలుకు జ్యోతుల శ్రీనివాసు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.