Logo
Date of Publish : 10 January 2026, 9:39 pm
Editor : CH. MUKUNDARAO

జననాయగన్ వివాదం : విజయ్ కు అండగా స్టాలిన్

విల్లివాకం న్యూస్: విజయ్ రాజకీయ ప్రవేశ నేపథ్యంలో ‘జన నాయగన్’ సినిమాపై ఏర్పడిన వివాదం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. శుక్రవారం వరకు విజయ్ సినిమాను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్న ఆరోపణలు వస్తుండగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంపై విమర్శలు గుప్పించడంతో సంచలనం ఏర్పడింది. తమిళ చలనచిత్ర రంగంలో విజయ్ అగ్ర నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టివికె) స్థాపించిన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్‌లో ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు రాజకీయ అద్దుకున్నాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ వివాదంలో తలదూర్చడమే కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం తమిళనాట చర్చనీయాంశమైంది.
ఇప్పటివరకు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ విజయ్ ఎదుగుదలను డీఎంకే (డిఎంకే) అడ్డుకుంటోందనే ప్రచారం జరిగింది. విజయ్ తన పార్టీ ప్రసంగాల్లో డీఎంకేను కూడా విమర్శించడంతో, ప్రభుత్వం ఆయన సినిమాకు ఇబ్బందులు సృష్టిస్తోందని అందరూ భావించారు. కానీ, సీఎం స్టాలిన్ అనూహ్యంగా సెన్సార్ బోర్డు (సీబీఎఫ్ సి) తీరును తప్పుబట్టడం ద్వారా ఆ విమర్శలకు చెక్ పడింది. సెన్సార్ బోర్డును కేంద్రం కీలుబొమ్మగా మార్చుకుందనీ, ఈడీ, సీబీఐ మాదిరిగానే సీబీఎఫ్‌సీని కూడా ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుతోందని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో నెట్టాయి.
..........


All Rights Reserved By telugunewstimes
Print Save