చక్రం తిప్పే అవకాశం తప్పడంతో కొత్త ఎత్తులు
బిజెపికి చేరువగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ దగ్గరకు జగన్
మారుతున్న రాజకీయ సవిూకరణాలు
కేంద్రంలో మూడోమారు అధికారం దక్కించుకున్న బిజెపి రాజకీయ దోబూచు లాడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్టాల్ల్రో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్, వైకాపాలతో లోపాయకారి
ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బిఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపిలు ఉన్నారు. రాజ్యసభలో బిజెపికి బలం లేదు. అందువల్ల వీరిని చేర్చుకుంటారన్న ప్రచారం ఉంది. అలాగే లోక్‌సభలో కూడా బిజెపికి సంపూర్ణ మెజార్టీ లేదు. అందువల్ల రానున్న కాలంలో అక్కడా బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు వైకాపాకు చెందిన ఎంపిలు నలుగురు బిజెపిలోకి వెళతారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇరు పార్టీలకు ఇది అవసరం కనుక అలా జరగవచ్చు. ఈ క్రమంలోనే ఈ రెండు ప్రాంతీయ పార్టీల నేతు కూడా తమకు ఏది మేలో అన్న ఆలోచనలో సాగుతున్నారు. జగన్ ఢల్లీి ధర్నాతో కాంగ్రెస్‌కు దగ్గర కావాలని చూస్తున్నట్లుగా ఉంది. తెలుగు రాష్టాల్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా ఈ రెండు పార్టీలు కలసి నడిచారని అందరికీ తెలుసు. బీఆర్‌ఎస్, వైసీపీకి వచ్చే ఎంపి సీట్లతో ఢల్లీిలో చక్రం తిప్పవచ్చని రెండు పార్టీల నేతలు అనుకున్నారు. గతంలో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడతానని కేసీఆర్ కూడా చెప్పారు. అయితే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు దెబ్బ తగిలింది. ఢల్లీి రాజకీయ పరిణామాలు వీరి పార్టీలకు ఎప్పుడూ అనుకూలంగా మారలేదు. దీంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుపు కోసం వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తమకు సమాచారం ఉందని కెసిఆర్, కెటిఆర్‌లు పదే పదే ప్రచారం చేసినా ..వైసీపీకి కాలం కలసి రాలేదు. దీంతో జాతీయ రాజకీయల్లో వీరికి పాత్రేవిూ లేకుండా పోయింది. బీఆర్‌ఎస్, వైసీపీలకు ఇప్పుడు తమకో అండ ఉండాలని జాతీయ స్థాయిలో ఎవరి రాజకీయాలు వారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బీఆర్‌ఎస్ అని వార్యంగా బీజేపీకి దగ్గరవుతోంది. అంతే అనివార్యంగా కాంగ్రెస్‌కు జగన్ దగ్గరవుతున్నారు. బీజేపీ నుంచి తన పార్టీకి పొంచి ఉన్న పెనుముప్పు నుంచి తప్పించుకునేందుకు, కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు బీఆర్‌ఎస్ కు మరో మార్గం కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే బీజేపీతో విలీన ఫార్ములాపై చర్చించి వచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బీజేపీపై విమర్శలు చేయడం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌పైనా నోఉ మెదపకపోవడం అంతులో భాగమే అంటున్నా... బీఆర్‌ఎస్ నేతలు నోరు మెదపడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏవిూ రాలేదని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు కానీ బీజేపీని పల్‌ఎలెత్తు మాట అనడంలేదు. అసెంబ్లీలోనూ అదే వరుస. రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడుతూ.. చీల్చి చెండాడుతానని అటున్న కేసీఆర్ .. కేంద్రంపై నోరు మెదపడం లేదు. వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తోంది. షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ వైసీపీకి ముప్పుగా మారుతుందన్న స్పష్టత రావడంతో కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లిపోతున్నారు. ఇండీ కూటమి వైపు వెళ్లానని చెప్పడానికే ఆయన ఢల్లీి ధర్నాను ఉపయోగించుకున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. అన్నీ ఆలోచించే జగన్ ఇండీ కూటమి నేతల మద్దతు తీసుకున్నారు. బీజేపీకి ఆయన మరోసారి దగ్గరయ్యే అవకాశాలు లేవు. మొత్తంగా బిజెపికి చేరువగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ª`కు చేరువగా జగన్ రాజకీయాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. రాజకీయాల్లో శతృత్వం ఉండదు కనుక ఎవరు ఎవరినైనా ఆదరించవచ్చు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com