ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్
నెల్లూరు న్యూస్ :సమాజాన్ని సంస్కరించేది, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దేది గురువులేనని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అన్నారు. వెంకటాచలం మండలం లోని సరస్వతి నగర్ లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ వేదాలను, మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను సృజించిన వేదవ్యాసుని ఆదిగురువుగా భావించి ఆయన పుట్టినరోజు ఆషాఢ పౌర్ణమి నాడు గురుపౌర్ణమి జరుపుకుంటారని తెలిపారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ గురువులను పూజిస్తారని తెలిపారు. అనంతరం ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ను ఆ కేంద్రం విద్యాత్మక సిబ్బంది, పరిశోధకులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు.