Logo
Date of Publish : 09 March 2026, 11:34 am
Editor : CH. MUKUNDARAO

వామ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విళ్లివాకం న్యూస్ : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, గ్రేటర్ చెన్నై మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక చూళైమేడు గిల్ నగర్ ఎక్స్టెన్షన్ లోని శ్రీహరి నిలయం దీనికి వేదికగా నిలిచింది. వామ్ గ్లోబల్ మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు జయశ్రీ తాడేపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ప్రతీ మహిళ తనలోని నైపుణ్యాలను గుర్తించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలు ఇంటికి దీపాల వంటి వారని, అందుచేత వారిని అదృష్టంగా భావించాలని తెలిపారు. కంటే కూతుర్నే కనాలని అన్నారు.

కార్యక్రమంలో వామ్ మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీలత. న్యాయవాది భవాని, అరుణాశ్రీ, మీనాక్షి, స్వాతి లక్ష్మి, తంగుటూరి రాజలక్ష్మి, రాణి హరినాథ్, చుక్కల విజయలక్ష్మి, వీఎన్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By telugunewstimes
Print Save