చెన్నై న్యూస్:ఈరోజు న్యూ ఢిల్లీలో "ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్" పేరిట ప్రముఖ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి శిభూ సోరెన్, మాజీ ఎంపీ డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్, మరియు అనేక రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక న్యాయంపై దృష్టి సారిస్తూ, సమానత్వం మరియు సమాజ శ్రేయస్సు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, మరియు వివిధ సంఘాల నేతలు సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించే చర్యల పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ద్రావిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాకపోవడంతో, ఆయన ప్రత్యేక వీడియో సందేశాన్ని కార్యక్రమం సందర్భంగా ప్రసారం చేయడం జరిగింది. ఆ సందేశంలో, కృష్ణారావు సమాజిక న్యాయ స్ధాపనలో ఈ ఫెడరేషన్ పాత్రను ప్రశంసిస్తూ, దేశం ముందుకు సాగేందుకు ఈ తరహా చర్చల ప్రాముఖ్యతను పేర్కొన్నారు.
ఈ సమావేశం సమాజంలో సమానత్వం, సహకారం, మరియు న్యాయంపై ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. "ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్" వంటి వేదికలు ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చే మార్గాలుగా అభివర్ణించబడ్డాయి.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com