Logo
Date of Publish : 25 January 2026, 2:33 pm
Editor : CH. MUKUNDARAO

ఒత్తిడులకు లొంగను: విజయ్

చెన్నై న్యూస్:తవేకా కార్యకర్తల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కీలక దశలో ఉందని పేర్కొన్న ఆయన, తమపై ఎలాంటి ఒత్తిడులు పనిచేయవని స్పష్టం చేశారు.
“నాపై ఒత్తిడి ఉందా అని అడిగితే — ఉంది. కానీ అది నా కోసం కాదు, ప్రజల కోసం. మార్పులు ఆశించిన ప్రజలు మోసపోయి ఒత్తిడిలో ఉన్నారు” అని విజయ్ అన్నారు.
తాను ఎప్పటికీ అవినీతికి పాల్పడనని, ఒక్క రూపాయి కూడా అక్రమంగా తీసుకునే అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. “అవినీతికి చుక్కంత స్థానం కూడా ఉండదు. ప్రజలే నా బలం” అని చెప్పారు.
రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, అన్నాడీఎంకే బీజేపీకి పూర్తిగా లొంగిపోయిందని ఆరోపించారు. డీఎంకేను ప్రజలకు హానికరమైన శక్తిగా అభివర్ణించారు.
తవేకా కార్యకర్తలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని సూచించారు.
“ఎవరైనా తప్పు చేస్తే, వారు ఎవరైనా సరే — తప్పించుకునే అవకాశం ఉండకూడదనే భయం ఉండాలి. పార్టీ అంతా ఐక్యంగా ప్రజల కోసం పనిచేయాలి” అని విజయ్ పిలుపునిచ్చారు. అనంతరం టీవీ కె ఎన్నికల గుర్తు అయిన' విజిల్ 'ను పరిచయం చేసి ఆవిష్కరించి కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
.........


All Rights Reserved By telugunewstimes
Print Save