Logo
Date of Publish : 03 June 2025, 11:44 pm
Editor : CH. MUKUNDARAO

ఆర్‌సిబికి చారిత్రక విజయం: ఐపీఎల్ ట్రోఫీపై తొలి సారిగా ముద్ర

చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్‌లో 10 జట్లు పోటీపడ్డ సుదీర్ఘ మల్లయుద్ధానికి ముగింపు పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన ఆర్‌సిబి తమ ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీను అందుకుంది.

టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 43 పరుగులతో అగ్ర స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామిసన్‌లు చెరో మూడు వికెట్లు తీసి రాణించారు.

191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రబ్సిమ్రాన్ సింగ్ (26) మరియు ప్రియాంష్ ఆర్య (24) శుభారంభం అందించేందుకు యత్నించారు. కానీ మద్యంలో వరుస వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ ఒత్తిడికి లోనైంది. ఇంగ్లిస్ 39 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగుతో పెవిలియన్ చేరాడు.

తరువాత నేహల్ వాద్రా (15), శశాంక్ సింగ్‌లు కలిసి పునరుద్ధరణకు ప్రయత్నించినా, ఆర్‌సిబి బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తమ దిశగా మలిచారు. చివరకు పంజాబ్ నిర్ణీత లక్ష్యానికి తక్కువగా స్కోర్ చేసి ఓటమి చవిచూసింది.

ఆర్‌సిబి విజయం తాత్కాలిక గెలుపు కాదు, ఇది వారి అభిమానులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సంతోషాన్ని అందించింది. విజేతగా నిలిచి తొలి ట్రోఫీని ఎగరేసిన ఆర్‌సిబి ఆటగాళ్లు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు.


All Rights Reserved By telugunewstimes
Print Save