చెన్నై న్యూస్ :చెన్నైలోని పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గంలో TVK పార్టీ అధినేత విజయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు అధికారికంగా ఆమోదించారు. రిటర్నింగ్ అధికారి పరిశీలన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే, విజయ్ నామినేషన్ ఆమోదంపై కొంత వివాదం నెలకొంది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆయన నామినేషన్ను ఆమోదించకూడదని వాదిస్తూ అధికారులకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పెరంబూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది.