చెన్నై న్యూస్: బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ వాసులు ఇంటింటి బతుకమ్మ వేడుకను బుధవారం రాత్రి ఎంతోఘనంగా సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. చెన్నై తండయారుపేట నెహ్రు నగర్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజలు వందలాదిమంది నివసిస్తున్నారు. వీరంతా ప్రతి ఏడాది విజయదశమి సందర్భంగా బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సవంగా నిర్వహిస్తారు. లో భాగంగా ఏడాది బుధవారం రాత్రి మహిళలు బతుకమ్మను పూలతో అలంకరించి సంప్రదాయబద్ధంగా శ్రీ రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమం తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి అనంతరం బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలుపుతారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఐ వి బాలాజీ, సెక్రెటరీ జి. బాబు, కోశాధికారి పి. ప్రకాష్ బాబు, ఉపాధ్యక్షులు ఏ సురేష్, దాసం బాలాజీ, సహాయ కార్యదర్శి ఆర్ నాగరాజు, ఆర్ బాజీ బాబు, సహాయ కోశాధికారులు పి ఉదయ్ కుమార్, ఎస్ శశి కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com