విల్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణ జయంతి వేడుకలు కొరట్టూరు అగ్రహారం సీతారామ కళ్యాణ మండపం వేదికగా ఘనంగా జరిగాయి. ఇందులో ఉట్టి కొట్టడం, శ్రీకృష్ణ పూజ, ఒడిస్సి నృత్యాలు తదితర కార్యక్రమాలు ఉప్పులూరి విజయలక్ష్మి సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో జరిగాయి. ఇవన్నీ ఆహూతులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జేయం నాయుడు, కోశాధికారి జీవి రమణ, ఎన్ వి సురేష్ బాబు, హరినాద్, సరస్వతి, బాలాజీ, కుమార్, ప్రసాద్, శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com