*మూడు బోగీలకు అంటుకున్న మంటలు
*తప్పిన ప్రమాదం
పొన్నేరి న్యూస్ :దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు మైసూరు నుంచి చెన్నై సెంట్రల్‌కు వస్తోంది. తిరువళ్లూరు జిల్లా కవరప్పెట్టై సమీపంలో రైలు వస్తుండగా అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలు 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం చీకటిగా ఉండడంతో ప్రమాదానికి గురైన ప్రయాణికుల సంఖ్య ఇంకా తెలియరాలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
కవర పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆంధ్రా వైపు వెళ్తున్న మైసూరు దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడ నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో రెండు ఏసీ కోచ్‌లలో మంటలు చెలరేగాయి. రెండు కొచ్ లోమంటలను ఆర్పే పనిలో అగ్నిమాపక శాఖ నిమగ్నమై ఉంది. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం.
ముమ్మరంగా సహాయక చర్యలు:
ఆగివున్న గూడ్స్ రైలుని భాగమతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ రైలు.. మైసూరు – దర్భంగా మధ్య నడుస్తుంది. కాగా.. ఈ ప్రమాద ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని మూడు కోచ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. మరో నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో తగలబడ్డ కోచ్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్లతో అదుపు చేశారు. మరోవైపు.. బోగిల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. గాయపడిన ప్రయాణికులను సమీప హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. సిగ్నల్స్ సమస్య కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు అధికారులు.. ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి ప్రవేశించి ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది.
[video width="848" height="480" mp4="https://telugunewstimes.com/wp-content/uploads/2024/10/VID-20241011-WA0073.mp4"][/video]
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com