Logo
Date of Publish : 20 December 2025, 2:41 pm
Editor : CH. MUKUNDARAO

గిల్ ఔట్… శాంసన్ ఇన్… 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

ముంబై: వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగనుంది.
పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న శుభ్‌మన్ గిల్‌కు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇషాన్ కిషన్‌కు మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కింది.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

.........


All Rights Reserved By telugunewstimes
Print Save