Logo
Date of Publish : 10 March 2026, 10:58 pm
Editor : CH. MUKUNDARAO

గ్యాస్ కొరత ప్రచారం… బంకుల వద్ద ఆటో డ్రైవర్ల రద్దీ

చెన్నై న్యూస్: అమెరికా–ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడి చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతుందనే వార్తల నేపథ్యంలో చెన్నైలోని కొరుక్కుపేట, తండయారుపేట, పాత చాకలిపేట, పెరంబుర్ , ప్యారిస్ , చెన్నై సెంట్రల్ ,పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరతపై ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రచారం కారణంగా నగరంలోని పెట్రోల్ బంకులు మరియు గ్యాస్ డిపోల వద్ద ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు.
గ్యాస్ కొరతను కారణంగా చూపుతూ కొన్ని పెట్రోల్ బంకుల నిర్వాహకులు పాత ధరతో పోలిస్తే కిలోకు రూ.15 నుంచి రూ.30 వరకు అధికంగా వసూలు చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అధిక ధరలు ఉన్నప్పటికీ తమ ఉపాధి దెబ్బతింటుందనే భయంతో ఆటో డ్రైవర్లు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది.
ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని ప్రకటించినప్పటికీ సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలు ఆటో డ్రైవర్లలో ఆందోళనను పెంచుతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు భయపడుతున్నారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చి తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.

...........


All Rights Reserved By telugunewstimes
Print Save