Logo
Date of Publish : 29 June 2024, 5:56 pm
Editor : CH. MUKUNDARAO

జులై 1 నుండి క్రిమినల్ చట్టాలు మరింత కఠినం

  • స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో చేర్చారు.
  • మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కేంద్రం కఠినతరం చేసింది . 
  • కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు.
  • ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీ, తీవ్రవాదానికి చెక్‌ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు.
  • సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, వేర్పాటువాదం..లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు భంగం కలిగించే యాక్టివిటీస్‌పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను చేర్చారు.
  • కొన్ని నేరాలకు జరిమానాలు, శిక్షలను పొడిగించారు.
  • బలవంతపు వసూళ్లు, క్రైమ్‌ సిండికేట్‌ కోసం చేసే సైబర్‌ నేరాలు, ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ కు కఠినమైన చర్యలు ఉంటాయి..
  • కులం, భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమందిని హత్య చేస్తే.. నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.
  • నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పటిలానే ఏడేళ్లకు కొనసాగించారు..
  • ఓ వర్గంపై దాడుల్లో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమైనవారికి జీవితఖైదు లేదా మరణశిక్ష, ఫైన్ పడనుంది..
  • నేర తీవ్రతను శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం. ఒక వ్యక్తి మరణానికి కారణమైతే రూ.10లక్షల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవితఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు...

All Rights Reserved By telugunewstimes
Print Save