Logo
Date of Publish : 07 April 2026, 9:11 am
Editor : CH. MUKUNDARAO

7 నుంచి ఉచిత వైద్య ఆహార నాడీ చికిత్సా శిబిరం

విళ్లివాకం న్యూస్: సాయి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్,
కార్నేషన్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంయుక్త ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత వైద్య ఆహార నాడీ చికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు, ఎన్. రాజేష్ కుమార్, కార్యదర్శి టిపి రాజా, కోశాధికారి
ఎన్.సి. సుమేష్ ఆదిత్య, కమిటీ చైర్మన్, ఎన్. జయరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం
07 ఏప్రిల్ 2026 నుండి 21 ఏప్రిల్ 2026 వరకు
సమయం: ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. శిబిరం ఏర్పాటయిన స్థలం :
కార్నేషన్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, నెం. 42, కస్తూరిబాయి స్ట్రీట్, కార్నేషన్ నగర్, కొరుక్కుపేట్, చెన్నై - 600021. ఫుట్ పల్స్ థెరపీ తీసుకోవడం వల్ల ఈ క్రింది సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది. ప్రఖ్యాత డయాబెటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, స్పోర్ట్స్ ఆర్డో మరియు ఫిజియోథెరపిస్టులచే ఆమోదించబడింది. క్లినికల్ గా నిరూపించబడిన టిఈఎన్ఎస్ మరియు ఈఎంఎస్ చికిత్సా పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9344402526/9344417476 సెల్ నంబర్లను సంప్రదించవచ్చు.
.......


All Rights Reserved By telugunewstimes
Print Save