telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Fri, 05 Jun 2026 15:18:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg telugu news times https://telugunewstimes.com 32 32 అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన https://telugunewstimes.com/yadavalli-aruna-srinaths-captivating-rendition-of-devotional-songs/ https://telugunewstimes.com/yadavalli-aruna-srinaths-captivating-rendition-of-devotional-songs/#respond Fri, 05 Jun 2026 15:17:53 +0000 https://telugunewstimes.com/?p=5986 విళ్లివాకం న్యూస్: చెన్నై పెరంబూరు, పటేల్ రోడ్డులో గల ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు రోజుల కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజుగా ఉదయం 6:00 గంటలకు గణపతి హోమంతో ప్రారంభించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు గాయని యడవల్లి అరుణ శ్రీనాథ్ నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది.

ఇందులో హిందోళ రాగంలో ‘నిగమ నిగమ’ (అన్నమాచార్య కీర్తన), ‘చరణములే నమ్మితి’, ‘పలుకే బంగారమాయన’, ‘పిబరే రామరసం’, ‘కురై ఒండ్రుం ఇలై’ తదితర కీర్తనలు శ్రావ్యంగా ఆలపించారు. అలాగే, గాయకులు ఎం.ఆర్ సుబ్రహ్మణ్యం కొన్ని భక్తి గీతాలను ఆలపించారు. కీబోర్డు ఎన్ వి బాబు, తబలా రమేష్ సహకారం అందించారు. ఇందులో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, సహాయ కార్యదర్శి పి రవికుమార్, కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు, గుడిమెట్ల చెన్నయ్య, విజయలక్ష్మి, శ్రీనాథ్ సహా పుర ప్రముఖులు పాల్గొన్నారు. చివరిగా అరుణ శ్రీనాథ్, ఎంఆర్ సుబ్రహ్మణ్యంలను నిర్వాహకులు సత్కరించారు.

 

]]>
https://telugunewstimes.com/yadavalli-aruna-srinaths-captivating-rendition-of-devotional-songs/feed/ 0
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు https://telugunewstimes.com/victory-team-bengaluru-retains-the-crown-for-the-second-consecutive-time/ https://telugunewstimes.com/victory-team-bengaluru-retains-the-crown-for-the-second-consecutive-time/#respond Sun, 31 May 2026 18:35:17 +0000 https://telugunewstimes.com/?p=5979 చెన్నై న్యూస్: దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్–2026 తుదిపోరులో బెంగళూరు జట్టు గుజరాత్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో వరుసగా రెండోసారి విజేతగా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రీడామైదానంలో ఆదివారం జరిగిన ఈ పోటీలో బెంగళూరు జట్టు నాణెం ఎగరేసి గెలిచి ముందుగా బంతి విసరాలని నిర్ణయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు, బెంగళూరు బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనకు తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రారంభ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ 10 పరుగులు, సాయి సుదర్శన్ 12 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే వెనుదిరిగారు.
కష్టాల్లో పడిన జట్టును ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడు 37 బంతుల్లో అర్ధశతకం సాధించి జట్టుకు కొంత స్థిరత్వాన్ని తీసుకొచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు తరఫున రసిఖ్ సలాం మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు.
156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ప్రారంభంలోనే వేగవంతమైన భాగస్వామ్యాన్ని అందించారు. వెంకటేష్ అయ్యర్ 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మరోవైపు కోహ్లీ తనదైన శైలిలో ధాటిగా ఆడుతూ కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాడిగా కొత్త మైలురాయిని నెలకొల్పాడు.
మధ్యలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసి గుజరాత్‌కు ఆశలు కల్పించినప్పటికీ, కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడు 42 బంతుల్లో 75 పరుగులు చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది నాలుగులు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి.
దీంతో బెంగళూరు జట్టు 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుని వరుసగా రెండోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సంబరంగా జరుపుకుంటున్నారు.

……….

]]>
https://telugunewstimes.com/victory-team-bengaluru-retains-the-crown-for-the-second-consecutive-time/feed/ 0
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన https://telugunewstimes.com/confusion-over-language-policy-telugu-students-concern/ https://telugunewstimes.com/confusion-over-language-policy-telugu-students-concern/#respond Sat, 30 May 2026 10:29:36 +0000 https://telugunewstimes.com/?p=5976 – తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

చెన్నై న్యూస్:భాషా విధానంపై తమిళనాడులో రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు భాషల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది హిందీ కాని రాష్ట్రాలపై హిందీని పరోక్షంగా రుద్దే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో తమిళం, ఆంగ్లం మాత్రమే కొనసాగుతాయని, మూడు భాషల విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరో తరగతి నుంచి మూడు భాషల విధానాన్ని స్వాగతించినప్పటికీ, ఈ విద్యా సంవత్సరంలోనే తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ముందుగా 2029–30 నుంచి అమలు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు అకస్మాత్తుగా మార్పులు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఇద్దరు నాయకుల భిన్నమైన ప్రకటనలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయని జగదీశ్వర రెడ్డి అన్నారు.
మూడు భాషల విధానం అంటే ఏమిటి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం–2020 (NEP 2020) ప్రకారం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఐదో తరగతి వరకు, వీలైతే ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని ఈ విధానం సూచిస్తోంది.
యునెస్కో కూడా పిల్లలు తమ మాతృభాషలో విద్యను ప్రారంభిస్తే పాఠాలు సులభంగా అర్థమవుతాయని, ఆలోచనా శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొంటోంది.
తమిళనాడులో తెలుగు పిల్లల పరిస్థితి
తమిళనాడులో రెండు భాషల విధానం కొనసాగుతున్నప్పటికీ, తెలుగు భాషా ఉపాధ్యాయులను ప్రభుత్వం తగిన సంఖ్యలో నియమించలేదని ఆయన ఆరోపించారు. తెలుగు మాతృభాష పరీక్ష మార్కులను మొత్తం మార్కుల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదని, దీంతో అనేక తెలుగు కుటుంబాలు తమ పిల్లలను బలవంతంగా తమిళ మాధ్యమంలో చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఇది తెలుగు భాష అభివృద్ధికి నష్టమని, భవిష్యత్తులో పిల్లలు తమ మాతృభాషను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ ప్రాంతంలో మలయాళాన్ని మొదటి భాషగా తప్పనిసరి చేసే చర్యల కారణంగా కన్నడ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితులు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తమిళనాడు తెలుగు యువశక్తి డిమాండ్లు:
వెంటనే తెలుగు భాషా ఉపాధ్యాయులను నియమించాలి.
మాతృభాష పరీక్ష మార్కులను మొత్తం మార్కుల్లో కలపాలి.
ప్రతి విద్యార్థికి తన మాతృభాషలో చదివే హక్కును గౌరవించాలి.
విద్యా విధానాలపై తల్లిదండ్రుల కమిటీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలు తీసుకునే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను కోరారు.
భాషల పేరుతో ఉద్యమాలు, ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“మా భాష – మా హక్కు” “మాకు తెలుగు నేర్చుకునే హక్కు కావాలి”
అని ఆయన పేర్కొన్నారు.

]]>
https://telugunewstimes.com/confusion-over-language-policy-telugu-students-concern/feed/ 0
చెన్నైలో ఘనంగా ‘నిధి జ్యువెల్స్’ ప్రారంభోత్సవం https://telugunewstimes.com/nidhi-jewels-grandly-inaugurated-in-chennai/ https://telugunewstimes.com/nidhi-jewels-grandly-inaugurated-in-chennai/#respond Mon, 18 May 2026 14:46:51 +0000 https://telugunewstimes.com/?p=5968 విల్లివాకం న్యూస్: చెన్నై, ప్యారిస్, సౌకార్ పేట, ఎన్ఎస్సి బోస్ రోడ్డు, 147, గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ‘నిధి జ్యువెల్స్’ పేరిట కొత్త షోరూం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. తంగుటూరి రామకృష్ణ, ఊరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షోరూమును తంగుటూరి తాస్య, తన్విక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ గుప్తా, త్రినాధ్ సహా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు పాల్గొన్నారు.

అలాగే చందన్, కుందన్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తమ షోరూమ్ లో బంగారు, వెండి సామగ్రి, గిఫ్ట్ ఆర్టికల్స్ లభిస్తాయని, ఇవన్నీ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

……

]]>
https://telugunewstimes.com/nidhi-jewels-grandly-inaugurated-in-chennai/feed/ 0
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ https://telugunewstimes.com/kethireddy-jagadeeshwara-reddys-letter-to-prime-minister-modi-on-neet-irregularities/ https://telugunewstimes.com/kethireddy-jagadeeshwara-reddys-letter-to-prime-minister-modi-on-neet-irregularities/#respond Sat, 16 May 2026 06:46:47 +0000 https://telugunewstimes.com/?p=5965 చెన్నై న్యూస్ :దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్షల రద్దులు, పునఃపరీక్షల నిర్వహణ వంటి పరిణామాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం చోటుచేసుకున్న వివాదాల కారణంగా నిరాశ, ఆందోళనలకు లోనవుతున్నారని తెలిపారు.
దేశంలోని అనేక కుటుంబాలు తమ పిల్లల విద్య కోసం శిక్షణా కేంద్రాలు, ప్రయాణం, వసతి తదితర ఖర్చుల కోసం భారీ మొత్తాలను వెచ్చించాయని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం విద్యార్థులకు అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ విద్యా సంవత్సరంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ ఏడాదికి మాత్రమే అయినా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు.
………..

]]>
https://telugunewstimes.com/kethireddy-jagadeeshwara-reddys-letter-to-prime-minister-modi-on-neet-irregularities/feed/ 0
నీట్ పునఃపరీక్ష జూన్ 21న నిర్వహణ.. ఎన్‌టీఏ అధికారిక ప్రకటన https://telugunewstimes.com/neet-re-exam-to-be-conducted-on-june-21-nta-official-announcement/ https://telugunewstimes.com/neet-re-exam-to-be-conducted-on-june-21-nta-official-announcement/#respond Fri, 15 May 2026 04:36:01 +0000 https://telugunewstimes.com/?p=5961 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ)–2026 పరీక్షకు సంబంధించిన పునఃపరీక్ష తేదీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. రద్దు చేసిన పరీక్షకు బదులుగా కొత్తగా నిర్వహించే నీట్ పరీక్షను 2026 జూన్ 21, ఆదివారం రోజున నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ శుక్రవారం వెల్లడించింది.
గత మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, పరీక్ష పారదర్శకతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రశ్నాపత్రం లీక్, అక్రమ మార్గాల్లో మార్కులు సాధించారన్న ఫిర్యాదులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మే 3న నిర్వహించిన పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేసింది.
పరీక్ష రద్దు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పలువురు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పునఃపరీక్షను త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
పునఃపరీక్షకు సంబంధించిన ప్రవేశ పత్రాలు, పరీక్షా కేంద్రాల వివరాలు మరియు మార్గదర్శకాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, వదంతులను విశ్వసించవద్దని ఎన్‌టీఏ సూచించింది.
………..

]]>
https://telugunewstimes.com/neet-re-exam-to-be-conducted-on-june-21-nta-official-announcement/feed/ 0
ముఖ్యమంత్రి విజయ్ అధికారిక చిత్రపటం విడుదల.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశాలు https://telugunewstimes.com/official-portrait-of-chief-minister-vijay-released-orders-issued-to-display-it-in-government-offices/ https://telugunewstimes.com/official-portrait-of-chief-minister-vijay-released-orders-issued-to-display-it-in-government-offices/#respond Fri, 15 May 2026 02:51:25 +0000 https://telugunewstimes.com/?p=5958 చెన్నై న్యూస్ : ఈ నెల 10వ తేదీన శ్రీ ఎస్. జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల సమక్షంలోనే ఆయన మూడు కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకం, ‘సింగప్పెన్’ పేరుతో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యదళం ఏర్పాటు, అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక నిరోధక దళం ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి ఆమోదించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎస్. జోసెఫ్ విజయ్ అధికారిక చిత్రపటాన్ని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ భవనాలలో ఈ చిత్రపటాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
……..

]]>
https://telugunewstimes.com/official-portrait-of-chief-minister-vijay-released-orders-issued-to-display-it-in-government-offices/feed/ 0
విశ్వాస తీర్మానంలో విజయ్ ప్రభుత్వ విజయం https://telugunewstimes.com/vijay-governments-victory-in-the-confidence-motion/ https://telugunewstimes.com/vijay-governments-victory-in-the-confidence-motion/#respond Wed, 13 May 2026 06:31:01 +0000 https://telugunewstimes.com/?p=5954 *ముఖ్యమంత్రిగా విజయ్ కొనసాగింపు

చెన్నై న్యూస్ : తమిళనాడు శాసనసభలో నేడు ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది. అధికార పక్షం తరఫున తీసుకువచ్చిన ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి విజయ్ సభలో ప్రసంగించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, చివరగా ముఖ్యమంత్రి విజయ్ మరోసారి సమాధాన ప్రసంగం చేశారు.
విశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే ముందు శాసనసభకు సంబంధించిన అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేయాలని సభాపతి జె.సి.డి. ప్రభాకరన్ ఆదేశించారు. అనంతరం సభను ఆరు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగంలో విడతల వారీగా ఓటింగ్ నిర్వహించారు.
సభ్యులను నిలబెట్టి ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి విభాగంలో 30 మంది సభ్యులు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించగా, రెండో విభాగంలో 42 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. మూడో విభాగంలో 46 మంది సభ్యులు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
నాలుగో విభాగంలో ఎస్.పి. వేలుమణి వర్గానికి చెందిన 25 మంది అన్నాడీఎంకే సభ్యులు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఐదో, ఆరవ విభాగాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓటు వేశారు. మరో ఐదుగురు సభ్యులు తటస్థంగా నిలిచారు. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు.
ఓటింగ్ జరుగుతున్న సమయంలో ద్రావిడ మున్నేట్ర కళగం సభ్యులు సభ నుంచి నిరసనగా నిష్క్రమించారు.
144 మంది సభ్యుల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ విజయం కూటమి ప్రభుత్వం శాసనసభలో తన మెజారిటీని విజయవంతంగా నిరూపించుకుంది. దీంతో విజయ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది.
శాసనసభలో జరిగిన విశ్వాస తీర్మాన ఫలితాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు అధికారికంగా తెలియజేయడానికి సభాపతి జె.సి.డి. ప్రభాకరన్ సిద్ధమవుతున్నారు.
………….

]]>
https://telugunewstimes.com/vijay-governments-victory-in-the-confidence-motion/feed/ 0
నేడు మెజారిటీ నిరూపణకు టీవీకే ప్రభుత్వ బలపరీక్ష https://telugunewstimes.com/government-faces-floor-test-on-tv-today-to-prove-majority/ https://telugunewstimes.com/government-faces-floor-test-on-tv-today-to-prove-majority/#respond Wed, 13 May 2026 01:41:03 +0000 https://telugunewstimes.com/?p=5951 చెన్నై న్యూస్: ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం కోరిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు జరుగనుందని శాసనసభ కార్యాలయం ప్రకటించింది. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వానికి మద్దతు కోరుతూ ప్రారంభ ప్రసంగం చేయనున్నారు. అనంతరం విశ్వాస తీర్మానంపై సభా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
226 స్థానాలు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోరింది.
దీనికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ 5 మంది సభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 2 మంది సభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ 2 మంది సభ్యులు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 మంది సభ్యులు, విడுதలై చిరుతైగల్ కచ్చి 2 మంది సభ్యులు మద్దతు ప్రకటించాయి. ఈ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయగా, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
17వ శాసనసభ సమావేశాలు మే 10న ప్రారంభమయ్యాయి. సభ్యులు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేయగా, నిన్న జే.సీ.డి. ప్రభాకరన్ సభాపతిగా, రవిశంకర్ ఉప సభాపతిగా, సబరీనాథన్ విప్‌గా ఎన్నుకోబడ్డారు.
ఈ నేపథ్యంలో, ఈ రోజు జరిగే విశ్వాస తీర్మానం ద్వారా విజయ్ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోనుంది. సభలో హాజరైన సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.
ఓటింగ్ విధానం ధ్వనిమతం ద్వారా లేదా సభ్యుల సంఖ్యను లెక్కించే పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉంది.

]]>
https://telugunewstimes.com/government-faces-floor-test-on-tv-today-to-prove-majority/feed/ 0
NTA సంచలన నిర్ణయం.. మే 3న జరిగిన నీట్‌ పరీక్ష రద్దు! https://telugunewstimes.com/ntas-sensational-decision-neet-exam-held-on-may-3rd-cancelled/ https://telugunewstimes.com/ntas-sensational-decision-neet-exam-held-on-may-3rd-cancelled/#respond Tue, 12 May 2026 07:21:00 +0000 https://telugunewstimes.com/?p=5948 దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్-2026 ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రాజస్థాన్‌లో బయటపడిన ప్రశ్నాపత్ర లీక్ ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు మరియు విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని NTA స్పష్టం చేసింది. తిరిగి పరీక్ష నిర్వహణ తేదీపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

]]>
https://telugunewstimes.com/ntas-sensational-decision-neet-exam-held-on-may-3rd-cancelled/feed/ 0