telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Sun, 12 Jan 2025 11:29:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg telugu news times https://telugunewstimes.com 32 32 శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు https://telugunewstimes.com/sankranti-celebrated-in-grandeur-at-sri-andhra-kala-sravanti/ https://telugunewstimes.com/sankranti-celebrated-in-grandeur-at-sri-andhra-kala-sravanti/#respond Sun, 12 Jan 2025 11:29:02 +0000 https://telugunewstimes.com/?p=3943 విల్లివాకం: చెన్నై, కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీ కోదండ రామాలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలతో అలంకరించి వేడుకలను ఆరంభించారు. అనంతరం కొత్త మట్టి కుండల్లో పొంగలి వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ప్రసాదం వినియోగం చేశారు. ముగ్గులు, వంటలు పోటీలు నిర్వహించగా, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నుంగంబాక్కంలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు సంక్రాంతి విశిష్టతపై ప్రదర్శించిన నాటిక అందరినీ అలరించింది. ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు , కార్యదర్శి జె. శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, సలహాదారులు ఎమ్మెస్ మూర్తి, ఉపాధ్యక్షులు కేఎన్ సురేష్ బాబు,ఇంకా ఎంఎస్ నాయుడు, ఓ. మనోహర్, సహా కార్యవర్గ సభ్యులు, మహిళ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముగ్గులు, వంటల పోటీల విజేతలకు బహుమతులుగా 4 పి ఇంటర్నేషనల్ బెల్లంకొండ బ్రదర్స్ తరపున సిల్వర్ కాయిన్ లు, పోటీల్లో వారికి, న్యాయ నిర్ణేతలకు, అధ్యాపకులకు ఐఎస్ పి గ్రూప్ తరపున ఆయిల్ ప్యాకెట్లు బహమతులుగా అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో న్యాయనిర్ణేతలుగా శేషారత్నం, అన్నపూర్ణ, రాధిక, కల్పన, ఇందుమతి , అలాగే క్రీడా పోటీలకు గజగౌరి, విఎన్ హరినాధ్ వ్యవహరించారు. వేడుకల్లో ముందుగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .ఈ సందర్భంగా ఆంధ్ర కళా స్రవంతి తరపున తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు 300 మందికి సంక్రాంతి విందును అందించారు.

……..

]]>
https://telugunewstimes.com/sankranti-celebrated-in-grandeur-at-sri-andhra-kala-sravanti/feed/ 0
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ https://telugunewstimes.com/2025-telugu-under-the-auspices-of-andhra-kala-sravanti/ https://telugunewstimes.com/2025-telugu-under-the-auspices-of-andhra-kala-sravanti/#respond Sat, 11 Jan 2025 15:31:26 +0000 https://telugunewstimes.com/?p=3939 చెన్నై, న్యూస్: తెలుగు భాషా పరిరక్షణ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుక చెన్నై కొరట్టూరు అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె. ఎం. నాయుడు అధ్యక్షత వహించారు. ఆంధ్ర కళా స్రవంతి కార్యదర్శి జె. శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు పి. సరస్వతి, కార్యనిర్వాహక సభ్యులు ఓ. మనోహరన్, ఈ. బాలాజీ, ఆలయ కమిటీ సభ్యురాలు జె. రాధిక తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం తెలుగు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జె. ఎం. నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆంధ్ర కళా స్రవంతి తరఫున క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నామని, 2025 క్యాలెండర్‌ను కూడా అదే ఉద్దేశంతో విడుదల చేసినట్లు తెలిపారు. నగరంలోని తెలుగు వారందరికీ ఈ క్యాలెండర్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర కళా స్రవంతి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

]]>
https://telugunewstimes.com/2025-telugu-under-the-auspices-of-andhra-kala-sravanti/feed/ 0
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం https://telugunewstimes.com/sankranti-excitement-vs-police-action-cockfighting/ https://telugunewstimes.com/sankranti-excitement-vs-police-action-cockfighting/#respond Sat, 11 Jan 2025 14:51:48 +0000 https://telugunewstimes.com/?p=3935 రాజమండ్రి న్యూస్ :తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి జోరు మొదలైపోయింది. పండుగ కోసం హైదరాబాద్ నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు తరలిపోగా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందేల వేడుకలు ప్రారంభమయ్యే సూచనల మధ్య పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

పోలీసుల చర్యలు:

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో బరులను ధ్వంసం చేసిన పోలీసులు, నిర్వాహకులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

జంగారెడ్డిగూడెం డీఎస్పీ, కోడిపందేలు, గుండాట, కోతాటల వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో కూడా పోలీసులు బరులను ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇదే విధంగా బరులను ధ్వంసం చేశారు.

కోడిపందేలు నిర్వహకుల ధీమా:
సంక్రాంతి మూడు రోజుల పాటు కోడిపందేలకు అనుమతి వస్తుందనే ఆశతో నిర్వాహకులు బరులను సిద్ధం చేశారు. అయితే, చిన్న సమాచారం అందినా పోలీసులు రంగప్రవేశం చేసి బరులను ధ్వంసం చేస్తున్నారు.

సంక్రాంతి సంబరాలు మరియు నిబంధనలు:
కోడిపందేలు సంప్రదాయంగా సంక్రాంతి సందర్భంగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, కోడిపందేలు చట్టవిరుద్ధమని ప్రకటించినప్పటికీ, పండుగ ఉత్సాహంతో కొన్ని ప్రాంతాల్లో వాటి నిర్వహణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఏడాది కోడిపందేలకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

నివాసితుల స్పందనలు:
ఊరికి వచ్చే పండుగ సందడి మరియు సంప్రదాయ క్రీడలపై నిషేధం వలన కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు చట్టానికి కట్టుబడి ఉండడం అవసరమని అంటున్నారు.

ముఖ్యాంశాలు:ప్రాంతాలు: ఉభయగోదావరి, ఏలూరు, కోనసీమ, నూజివీడు, ఆగిరిపల్లి.పోలీసుల చర్యలు: బరుల ధ్వంసం, కఠిన హెచ్చరికలు. నిర్వాహకుల కసరత్తు: బరులను సిద్ధం చేస్తూ అనుమతుల కోసం ఆశ.
సాంప్రదాయం vs. చట్టం: సంక్రాంతి సంబరాలు మరియు నిబంధనల మధ్య సవాళ్లు.
ఈ సంక్రాంతికి కోడిపందేలపై చేపట్టిన పోలీసుల చర్యలు మరియు నిర్వాహకుల ప్రణాళికలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

]]>
https://telugunewstimes.com/sankranti-excitement-vs-police-action-cockfighting/feed/ 0
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు https://telugunewstimes.com/stampede-during-free-darshan-of-tirupati-vaikuntha-ekadashi-six-dead-many-injured/ https://telugunewstimes.com/stampede-during-free-darshan-of-tirupati-vaikuntha-ekadashi-six-dead-many-injured/#respond Wed, 08 Jan 2025 19:38:27 +0000 https://telugunewstimes.com/?p=3928 తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) భక్తుల కోసం ఉచిత దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వేలాది మంది భక్తులు టోకెన్లు పొందడానికి చేరుకోవడంతో రద్దీ తీవ్రతకు కారణమైంది.

ఈ భక్తుల తాకిడి క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని, సేలంకు చెందిన మల్లిక అనే మహిళతో పాటు ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. టిటిడి అధికారులతో చర్చించి, బాధితులకు అత్యవసర వైద్యం అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు.

ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదం నింపింది.

]]>
https://telugunewstimes.com/stampede-during-free-darshan-of-tirupati-vaikuntha-ekadashi-six-dead-many-injured/feed/ 0
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి https://telugunewstimes.com/telugu-rulers-from-tamil-nadu-cm-stalin/ https://telugunewstimes.com/telugu-rulers-from-tamil-nadu-cm-stalin/#respond Wed, 08 Jan 2025 09:24:56 +0000 https://telugunewstimes.com/?p=3925 టి నగర్ న్యూస్ :తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన చరిత్ర ప్రేమ, సంస్కృతి పరిరక్షణ పట్ల చూపుతున్న నిబద్ధత తెలుగు పాలకులకూ పాఠం కావాలి. సింధూ నాగరికత ఆనవాళ్లను గుర్తించి, వాటి వెనుక దాగి ఉన్న చరిత్రను వెలికితీసేందుకు ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయం, తమిళనాడు తెలుగు యువశక్తి వవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు .పురాతన వస్తువులపై పరిశోధనలకు రూ. 8 కోట్లు నజరానా ప్రకటించడమే కాకుండా, తన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి పునర్నిర్మాణంలో ఆసక్తి చూపుతున్న ఆయన ముందు మనం మన చరిత్రకు తీసుకునే బాధ్యతలపై ఆత్మపరిశీలన అవసరం.

తమిళనాడు పురావస్తు శాఖ వైఖరి – ప్రేరణగా నిలిచే చర్యలు

తమిళనాడు పురావస్తు శాఖ సింధూ నాగరికత కాలం నాటి వస్తువులను తవ్వి వెలికితీస్తూ ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సంబంధాలను నిరూపించే ఆధారాలను అందిస్తోంది. ఈ తవ్వకాల్లో మూడు వేల ఏళ్ల కిందటి సామాన్లు, లిపి, సాంస్కృతిక చిహ్నాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పరిశోధనలను ప్రోత్సహించేందుకు విశేష నిధులను కేటాయించడమే కాకుండా, వాటిని రాష్ట్ర చరిత్రకు అన్వయించుకోవాలని కలలుగొంటున్నారు.

తమిళుల చరిత్రకు సంబంధించి వెలుగులోకి రావొచ్చే అంశాలు:

తమిళ లిపి అత్యంత ప్రాచీనమని నిరూపించే ఆధారాలు.

రెండు, మూడు వేల ఏళ్ల కిందటి తమిళ చరిత్ర, ద్రవిడ సంస్కృతికి సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలు.

ఉత్తర ద్రవిడ సంస్కృతికి సంబధించిన అక్షరమాలలపై వివరణాత్మక పరిశోధనలు.

లేని ఆర్య-ద్రవిడ సిద్ధాంతాలను కూలద్రోశించే చారిత్రక సత్యాలు.

తెలుగు చరిత్రలో కనిపించని చింతన

తమిళ మూలాలను వెలికితీసేందుకు వారు చూపుతున్న తపనను చూస్తే, మన తెలుగు పాలకుల దగ్గర అంతటి చరిత్రాభిమానమేదీ కనిపించడం లేదు.
ఇక మన చరిత్రపైనే దృష్టి పెడితే:

ఖండవల్లి లక్ష్మీరంజనం, మల్లంపల్లి సోమశేఖర శర్మ, సురవరం ప్రతాపరెడ్డి వంటి పండితులు రచించిన పుస్తకాలను మనం తగినంతగా పరిశోధించలేకపోతున్నాం.

తెలుగు భాష, జానపద గేయ సాహిత్యం, సంస్కృతి పునాదులపై పరిశోధనలు గణనీయంగా తగ్గిపోవడం కనిపిస్తోంది.

చరిత్రకారులుగా పేరొందిన భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ వంటి వారు చెప్పిన పరిశోధనల ప్రాముఖ్యాన్ని మనం విస్మరిస్తున్నాం.

పాపులర్ కల్చర్‌కు ప్రాధాన్యం – చరిత్రకు తిరస్కారం

తెలుగు సినిమా, పాటలు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నా, మన భాషా సంస్కృతికి సంబంధించి అంతగా పునర్జీవన ప్రయత్నాలు జరగడం లేదు.

చిత్తూరు యాసలో పుష్ప 2 వంటి సినిమాలు రికార్డు వసూళ్లను సాధిస్తున్నప్పటికీ, ఆ యాస వెనుక దాగి ఉన్న భాషా శోభ, తమిళ ప్రభావం గురించి చర్చ తక్కువగా జరుగుతోంది.

మన నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్నా, తెలుగు భాష అంతర్జాతీయంగా గుర్తింపు పొందే స్థాయిలో కృషి జరగడం లేదు.

తెలుగు పాలకులకు సూచన

మన పాలకులు చరిత్ర, భాష, సంస్కృతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రాచీన ఆధారాలను వెలికితీసేందుకు తమిళనాడు వంటి తవ్వకాలు చేపట్టడం.

చరిత్రపరమైన పుస్తకాల అధ్యయనానికి, పరిశోధనలకు నిధులు కేటాయించడం.

తెలుగు భాషకు సంబంధించిన వైనాలు వెలుగులోకి తేవడం.

స్టాలిన్ తీసుకున్న చర్యలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మరి మన పాలకులు తమ సొంత చరిత్రను కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తారో చూడాలి.

స్టాలిన్ గారూ!
ఇంకో ఎనిమిది కోట్లు మీరే ఉదారంగా ప్రకటించి…ఏ తమిళనాడు క్రిష్ణగిరి దగ్గరో తవ్వకాలు జరపమనండి! మా తెలుగు చరిత్ర కూడా కచ్చితంగా ఎంతో కొంత దొరకకపోదు. పైగా ఆరోజుల్లో మనం కలిసే ఉన్నాం. మేమిక్కడ సినిమా బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు, ఊపిరాగే అభిమానుల మధ్య ఉక్కిరిబిక్కిరి బిజీగా ఉన్నాము.

తెలుగు ప్రేక్షకుల జేబుల్లో చేతులుపెట్టి మొదటి ఆటకే వెయ్యి కోట్లు లాగేసే అధికారిక దోపిడీ పనుల్లో తీరికలేకుండా ఉన్నప్పుడు… తెలుగు భాషకో, తెలంగాణాకో వెయ్యేళ్ల చరిత్ర ఉంటే మాకేమిటి? రెండువేల ఏళ్ళ చరిత్ర ఉంటే మాకెందుకు? అదేమన్నా మాకు కూడు పెడుతుందా? గూడు కడుతుందా? కనీసం ఒక్క సినిమా బెనిఫిట్ షో టికెట్ అయినా సంపాదించిపెట్టగలుగుతుందా?

]]>
https://telugunewstimes.com/telugu-rulers-from-tamil-nadu-cm-stalin/feed/ 0
ఘనంగా గణేష్ పురం ఈసీఐ చర్చ్ 41వ వార్షికోత్సవం వేడుకలు https://telugunewstimes.com/ganeshpuram-eci-church-celebrates-its-41st-anniversary-with-grandeur/ https://telugunewstimes.com/ganeshpuram-eci-church-celebrates-its-41st-anniversary-with-grandeur/#respond Tue, 07 Jan 2025 16:04:11 +0000 https://telugunewstimes.com/?p=3917 చెన్నై న్యూస్: చెన్నై గణేష్ పురం ఈసీఐ చర్చ్ 41వ వార్షికోత్సవ వేడుకలు మంగళ వారం రాత్రి ఎంతో ఘనంగా జరిగాయి.ఈ సభ ఈసీఐ సౌత్ఆంధ్ర డయాసిస్, ఆల్ ఇండియా రెండవ వైస్ ప్రెసిడెంట్ గారైన బిషప్ ఏబేల్ నీలకంఠ గారి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డి. బాలరాజు ప్రారంభ ప్రార్థన చేసి అతిథులను గౌరవించారు. అనంతరం తెలుగు మద్రాస్ ఏరియా చైర్మన్ రెవరెండ్ సురేష్ బాబు గారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మధిర ఈసీఐ ఏరియా చైర్మన్ రెవరెండ్ మల్లికార్జున రావు పాల్గొని దైవ వాక్యాన్ని బోధించారు. అలాగే తను రక్షణ పొందిన విధానాన్ని సాక్ష్యంగా పంచుకున్నారు. ముందుగా స్థానిక సంఘ స్త్రీల సమాజం, యవ్వనస్తులు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా అతిధుల ను సంఘం తరఫున శాలువలతో సత్కరించారు.

బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ గారు సంఘస్థాపన, అభివృద్ధి తదితర విషయాలను గూర్చి వివరించారు. బిషప్ కమీషనరీ లు డాక్టర్ కె.ఆర్ ప్రసాద్ ప్రార్ధన చేయగా, రెవరెండ్ డి సురేష్ నాథ్ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఈసీఐ సౌత్ఆంధ్ర డయాసిస్ ట్రెజరర్ రెవరెండ్ వి. యోహాను పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లల ను సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవ్వనస్తులు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలు దేవునికి మహిమ కరంగా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగింది. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు.

………..

]]>
https://telugunewstimes.com/ganeshpuram-eci-church-celebrates-its-41st-anniversary-with-grandeur/feed/ 0
ఒకేసారి 105 మంది విద్యార్థులు యోగా ప్రపంచ రికార్డు https://telugunewstimes.com/105-students-at-a-time-in-the-world-of-yoga/ https://telugunewstimes.com/105-students-at-a-time-in-the-world-of-yoga/#respond Mon, 06 Jan 2025 11:41:07 +0000 https://telugunewstimes.com/?p=3908 విల్లివాకం న్యూస్: ప్రయివేటు యోగా శిక్షణ కేంద్రానికి చెందిన విద్యార్థులు 105 మంది అర్థ మచ్చెంద్ర ఆసనంలో ఏకంగా 10 నిమిషాల పాటు నిలబడి ప్రపంచ రికార్డు బుక్‌లోకి ఎక్కారు.
గుమ్మిడిపూండిలోని శ్రీ శంకరి యోగా ట్రైనింగ్ సెంటర్ మరియు ఇండియన్ యోగా అసోసియేషన్ తమిళనాడు చాప్టర్ సంయుక్తంగా యోగా వరల్డ్ రికార్డ్ ఈవెంట్‌ను నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి గుమ్మిడిపూండి యూనియన్ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షత వహించగా, మదన్‌లాల్ కెమాని వివేకానంద విద్యాలయ పాఠశాల ప్రిన్సిపాల్ జగతాంబిక, మహర్షి విద్యా మందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ తిలగ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

యోగా సెంటర్ వ్యవస్థాపకురాలు, శిక్షకురాలు సంధ్య ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో జరిగిన ఓ కార్యక్రమంలో 105 మంది విద్యార్థులు ఏకకాలంలో అర్థ మచేంద్ర ఆసనంలో 10 నిమిషాల పాటు నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించారు.

వారి విజయాన్ని వరల్డ్ వైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరియు శిక్షణా కేంద్రానికి పతకాలు మరియు ప్రపంచ సాఫల్య ధృవీకరణ పత్రాలను అందజేశారు. బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత సిందుజ వినీత్ చేతుల మీదుగా వీటిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.

……………….

]]>
https://telugunewstimes.com/105-students-at-a-time-in-the-world-of-yoga/feed/ 0 ఒకేసారి 105 మంది విద్యార్థులు యోగా ప్రపంచ రికార్డు - telugu news times nonadult
తెలుగు క్యాలెండర్ ముద్రణ దాత తోట కృష్ణ కు ఘన సన్మానం https://telugunewstimes.com/a-grand-tribute-to-thota-krishna-the-donor-of-the-telugu-calendar-printing/ https://telugunewstimes.com/a-grand-tribute-to-thota-krishna-the-donor-of-the-telugu-calendar-printing/#respond Mon, 06 Jan 2025 07:23:04 +0000 https://telugunewstimes.com/?p=3901 గుమ్మడి పూండి న్యూస్: యువత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థ ( యువత ట్రస్ట్) 2025 వ సంవత్సర తెలుగు క్యాలెండర్ ను సోమవారం ఉదయం గుమ్మిడి పూండి సమీపంలోని పాపన్న కుప్పం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కంపెనీలో క్యాలెండర్ ముద్రణ దాత, ప్రముఖ పారిశ్రామికవేత్త తోటకృష్ణ ను శాలువా, చందనం మాలతో సత్కరించి యువత క్యాలెండర్ ను యువత సంస్ధ అధ్యక్షులు సిహెచ్ ముకుందరావు అందజేశారు. గత మూడేళ్లగా యువత తెలుగు క్యాలెండర్ ముద్రణకు సహకరించి మమ్ములను ముందుకు నడిపిస్తున్న తోట కృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాత తోట కృష్ణ మాట్లాడుతూ… యువత ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు, తన వంతు ఎప్పుడు సహకరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు వికాస సమితి ప్రధాన కార్యదర్శి వెలుగుల కృష్ణమోహన్, శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి  నటరాజ్, కంపెనీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

 

]]>
https://telugunewstimes.com/a-grand-tribute-to-thota-krishna-the-donor-of-the-telugu-calendar-printing/feed/ 0
HMPV మహమ్మారి ముప్పు: మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి!” https://telugunewstimes.com/hmpv-pandemic-threat-wear-masks-take-precautions/ https://telugunewstimes.com/hmpv-pandemic-threat-wear-masks-take-precautions/#respond Mon, 06 Jan 2025 05:49:42 +0000 https://telugunewstimes.com/?p=3898 చెన్నై న్యూస్:కొన్ని సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన విధానం అందరికీ గుర్తుంది. చైనాలో ప్రారంభమైన ఆ వైరస్, ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మందిని ప్రభావితం చేసింది. ఇప్పుడు చైనాలో HMPV (Human Metapneumovirus) కేసులు పెరుగుతుండటంతో, అదే ముప్పు మళ్లీ మన దేశానికి రావచ్చనే భయం వ్యక్తమవుతోంది.

ఇటీవల బెంగళూరులో 8 నెలల చిన్నారి HMPV లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో, ఈ వైరస్ ఇప్పటికే మన దేశంలో అడుగుపెట్టినట్టే కనిపిస్తోంది. HMPV సంక్రమణ శ్వాస సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్‌కు బలవుతారు.

జాగ్రత్తలు:

1. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి.

2. చేతులను సబ్బుతో మెలకువగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి.

3. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయండి.

4. పెద్ద సమూహాల్లో ఉండటం తగ్గించండి.

 

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించడం, సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యం. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే, మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలగుతాం.

హెల్త్ అనలిస్టుల హెచ్చరిక:
“ప్రపంచంలో ఎక్కడైనా మహమ్మారి పుట్టినప్పుడు, దాని ప్రభావం కేవలం గడచిన ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం అనివార్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి,” అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మాస్కులు ధరించడం మళ్లీ మన జీవన శైలిలో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది.

]]>
https://telugunewstimes.com/hmpv-pandemic-threat-wear-masks-take-precautions/feed/ 0
ఘనంగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు https://telugunewstimes.com/kethireddy-jagadeeshwar-reddys-birthday-celebrated-in-grand-style/ https://telugunewstimes.com/kethireddy-jagadeeshwar-reddys-birthday-celebrated-in-grand-style/#respond Mon, 06 Jan 2025 04:48:29 +0000 https://telugunewstimes.com/?p=3894 విల్లివాకం న్యూస్: తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తమ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, సన్నిహితులు చాలా ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేడుకగా జరిపి సాంఘిక సేవా కార్యక్రమాలను చేయడం తనకు చాలా సంతోషదాయకమని అన్నారు. తమిళనాడులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు 15 కోట్ల మంది ఉన్నారని, నాడు పాఠశాలల్లో తెలుగు మీడియం చదివేవారు పర రాష్ట్రాలలో కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా ఉండేవారని, ప్రస్తుతం తెలుగు చదువుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మందికి తెలుగు ఇంటిలో మాట్లాడే భాషగా మాత్రమే ఉన్నదని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు భాష పట్ల వివక్షను చూపే విధంగా ప్రేరణ కలిగించారని, ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే కచ్చితంగా చదివే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని తెలిపారు. 2024 లో చలనచిత్ర పరిశ్రమ ఎన్నో విజయాలతో ముందుకు సాగిందని, 2025లో చిత్రాలు విజయవంతం అవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కేతిరెడ్డి కోరారు. పుట్టినరోజున ప్రముఖ పారిశ్రామిక వేత్త మల్లికార్జున రెడ్డి, సినీ దర్శకులు కిరణ్, హెచ్ రామలాల్, పి ప్రవీణ్, వెంకటేష్ పి ప్రవీణ్ కుమార్ రెడ్డి, చందన తదితరులు పాల్గొన్నారు.

………..

]]>
https://telugunewstimes.com/kethireddy-jagadeeshwar-reddys-birthday-celebrated-in-grand-style/feed/ 0